telangana
ఆదర్శ కుటుంబం’ విడుదలతో వెంకీ అభిమానుల సందడి!
సూర్య-గోదావరిఖని: విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదల సందర్భంగా పట్టణంలోని రాజేష్ థియేటర్‌లో ఆదివారం అభిమానులు సందడి చేశారు. సినిమా విడుదలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి, పరస్పరం మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలు నిర్వహించారు. వెంకటేష్ అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్‌కు చేరుకుని తమ అభిమాన హీరో సినిమా ప్రదర్శనను ఉత్సాహంగా వీక్షించారు. థియేటర్ వద్ద అభిమానుల సందడితో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో వెంకటేష్ ఫ్యాన్స్ రాష్ట్ర నాయకులు మహ్మద్ రఫీ, జిల్లా అధ్యక్షులు ఆలకుంట రాజేందర్, చిప్పకుర్తి రాజు, గరిగంటి కుమార్, ఉప్పుల వెంకటేష్, పారుపల్లి వెంకటేష్, మోరె కిషోర్, అనవేనా వేణు, పందిళ్ల సంతోష్, కలువ విశాల్, ఖంపెల్లి అనిల్, జూపాక శ్రీకర్, కందుకూరి సాయి, సబ్బని రాజేష్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.