BREAKING
అశ్వారావుపేటలో ఘనంగా కాపు నేత నాగబాబు నాయుడు జన్మదిన వేడుకలు* వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌.. - 205 మందిపై కేసులు - సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ అడ్మిన్ జి. నరేందర్ ఆలోచన.. అవగాహన.. ఆచరణ..! ప్రకృతి గురించి ఆలోచన చేయాలి,ఆ ఆలోచనపై మరింత అవగాహన పెంచుకోవాలి, ఆ తర్వాత ఆచరణలోకి తీసుకోవాలి. భట్టిప్రోలు, ఇంటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే ఆనంద బాబు విస్తృత ప్రచారం చావలి 1వ సెగ్మెంట్లోలో ప్రచారం వేగవంతం రైతు కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక భరోసా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం వగ్గంపల్లిలో వైసీపీకి గుడ్‌బై చెప్పిన 24 కుటుంబాలు రామ్ లీలా మైదాన్‌లో ‘ఓట్ బచావ్ - దేశ్ బచావ్’ మహా సభ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల ధర్నాకు తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా సంఘీభావం నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీమ్ గారి విగ్రహ ఆవిష్కరణ ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం శాంతిభద్ర సమస్యకు జగనే కారణం. ఘనంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఆదివాసీ సమాజ సేవే వనవాసి కళ్యాణ పరిషత్ లక్ష్యం

ఆర్టీసీ బ్రెడ్ విన్నర్ ఉద్యోగులకు రెగ్యులర్‌ కొలువులు

Select Suryaa Now
ఆర్టీసీ బ్రెడ్ విన్నర్ ఉద్యోగులకు రెగ్యులర్‌ కొలువులు
 సూర్య కరీంనగర్ ;;ఆర్టీసీలో విధి నిర్వహణలో ఉండగా మృతిచెందిన ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాల కింద కల్పించే బ్రెడ్ విన్నర్ ఉద్యోగాల విషయంలో ఎట్టకేలకు శుభపరిణామం చోటుచేసుకుంది. బీడబ్ల్యూఎస్‌ (బ్రెడ్ విన్నర్ స్కీమ్), ఎం.ఐ స్కీమ్ కింద తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న కండక్టర్ల సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కరీంనగర్ ఆర్.ఎం కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కరీంనగర్ రీజియన్ పరిధిలో  47 మందికి రెగ్యులర్ గ్రేడ్ 2 కండక్టర్ లుగా  గుర్తింపు లభించింది.
 
గతంలో ఆర్టీసీలో ఉద్యోగి మరణించిన, ఆన్ ఫిట్ ఆయన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద నేరుగా రెగ్యులర్ ఉద్యోగాలు కల్పించేవారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ విధానంలో మార్పులు చేసి బ్రెడ్ విన్నర్ స్కీమ్ కింద తాత్కాలిక పద్ధతిలో నియామకాలు చేపడుతున్నారు. దీంతో ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తూ కుటుంబాలను పోషించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ వేతనాలు, ఇతర ప్రయోజనాల్లో వ్యత్యాసం ఉండటంతో తీవ్ర మనోవేదనకు గురయ్యేవారు.
 
ఈ సమస్యను పరిష్కరించాలని గతంలో జరిగిన ఆర్టీసీ సమ్మె సందర్భంగా టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ ప్రధాన డిమాండ్లలో ఒకటిగా బ్రెడ్ విన్నర్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని ముందుకు తెచ్చింది. తాత్కాలిక నియామకాల విధానాన్ని రద్దు చేసి అర్హులైన ఉద్యోగులను డైరెక్ట్ రెగ్యులర్ పద్ధతిలో నియమించాలని యాజమాన్యాన్ని కోరింది. ఈ మేరకు సమ్మె సమయంలో యాజమాన్యంతో జరిగిన చర్చల్లో సానుకూల నిర్ణయం వెలువడటంతో ఉద్యోగుల చిరకాల సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది.
 
తాజాగా వెలువడిన ఉత్తర్వులతో కరీంనగర్ రీజియన్ పరిధిలో 47 మంది కండక్టర్ల సర్వీసులు క్రమబద్ధీకరణ పొందాయి. ఏళ్ల తరబడి తాత్కాలిక ఉద్యోగులుగా కొనసాగిన తమకు రెగ్యులర్ గుర్తింపు లభించడంతో ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉద్యోగ భద్రతతో పాటు వేతనపరమైన ప్రయోజనాలు లభించనున్న నేపథ్యంలో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 
తమ సమస్యను గుర్తించి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేసిన టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం రెడ్డి థామస్ రెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ నాయకులకు, సానుకూల నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ యాజమాన్యానికి బ్రెడ్ విన్నర్ ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెగ్యులర్ అయిన ఉద్యోగులకు టీ ఎంయూ రీజియన్ అద్యక్ష,కార్యదర్శులు జీ. పీ.సింగ్, ఏవీఆర్.రెడ్డి, కరీంనగర్ వన్ డిపో కార్యదర్శి జిల్లెళ్ళ మనోహర్ లు శుభా కాంక్షలు తెలిపారు.