BREAKING
మద్దికుంటలో 45 రోజుల ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచాలి ..:వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మహీంద్రా అస్వితలో సదస్సు బ్రహ్మకుమారిస్ దీపాలి స్నేహ సమ్మేళనం విజయవంతం. ఏఐపీఎస్ఓ రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక జీహెచ్‌ఎంసీ క్రీడా పోటీలు–2026 ప్రారంభం సిబిఎస్ఇ జాతీయ జిమ్నాస్టిక్ ఛాంపియన్‌షిప్ 2026 ప్రశాంత్ నగర్ కాలనీలో రోడ్డు ప్రమాదాలు నివారించండి .. కర్కాటక రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani రాహుల్ గాంధీ కాబోయే దేశ ప్రధాని: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి బాలయ్య నగర్ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మిథున రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani కోమటికుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి..: ప్రజావాణిలో ఆకుల సతీష్ ఫిర్యాదు.. ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలి.. వృషభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ఠ..* *విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ*

అమరుల ఆశయ సాధనకు ఐక్య ఉద్యమాలే ఆయుధం!

Select Suryaa Now
అమరుల ఆశయ సాధనకు ఐక్య ఉద్యమాలే ఆయుధం!
సూర్య-గోదావరిఖని:భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం సాగిన భారత విప్లవోద్యమంలో అమరులైన విప్లవకారుల ఆశయ సాధనకు ఐక్య ఉద్యమాలను నిర్మించడమే నిజమైన నివాళి అని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో ఆ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పొట్ల రామనర్సయ్య 50వ వర్ధంతి సభ నిర్వహించారు. పార్టీ జిల్లా నాయకులు ఈ.నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు జిల్లా కార్యదర్శి కే.రాజన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం వందేళ్లకు పైగా కొనసాగుతున్నప్పటికీ సంపూర్ణ విప్లవ లక్ష్యాన్ని సాధించలేకపోయిందని, ఇందుకు కమ్యూనిస్టు పార్టీల మధ్య ఏర్పడిన చీలికలే ప్రధాన కారణమని తమ పార్టీ భావిస్తోందని కే.రాజన్న పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీల ఐక్యత కోసం బలమైన శక్తిగా ఎదిగేందుకు న్యూ డెమోక్రసీ కృషి చేస్తుందని తెలిపారు. భారత విప్లవోద్యమంలో చారు మజుందార్, సత్యనారాయణ సింగ్, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి, పొట్ల రామనర్సయ్య, నీలం రామచంద్రయ్య, పైలా వాసుదేవరావు, జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్, ముక్తార్ పాషా తదితర ఎందరో విప్లవకారులు ప్రజా ఉద్యమాలకు తమ జీవితాలను అంకితం చేసి అమరులయ్యారని గుర్తుచేశారు. వారి ఆశయాల సాధన కోసం బలమైన ప్రజా పోరాటాలను నిర్మించాలని పిలుపునిచ్చారు.ఐఎఫ్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.కృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఏటా కోటి ఉద్యోగాల కల్పన, విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడం, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేయడం వంటి హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. నిరుద్యోగం పెరుగుతున్నా దేశాభివృద్ధిపై దృష్టి సారించకుండా కుల, మతాల మధ్య విభేదాలను పెంచుతోందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే మేధావులు, బుద్ధిజీవులను జైళ్లలో నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై బలమైన ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.ఇంకా ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.అశోక్, పార్టీ జిల్లా నాయకులు జి.సత్యనారాయణ రెడ్డి, తోకల రమేష్, మెరుగు చంద్రయ్య, ఐ.రాజేశం, బతుకుల రాజన్న, ఎస్.ప్రసాద్, పులిపాక మల్లేష్, కొండ్ర మొగిలి, రాజేశ్వరరావు, పీవైఎల్ జిల్లా నాయకులు ఆరుముళ్ల తిరుపతి, ఈ.బాబు, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు ఎన్.రాజేందర్, పుట్టపాక స్వామి, బండ పద్మ, కె.పద్మ, శ్రీజ, ఎం.కొమురయ్య, రాజేందర్, పోగుల శేఖర్, ప్రభాకర్ తదితరులతో పాటు సుమారు 100 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.