అలరించిన జయప్రద రామమూర్తి వేణు గానం
మేజర్ న్యూస్ :ప్రముఖ వేణు గాన విద్వాంసులు టి.ఆర్.మహాలింగం శతాబ్ది ఉత్సవాలులో భాగంగా మీనాక్షి సుందరంహాల్ లో ప్రముఖ సంగీత సంస్థ కళాసాగరం ఆధ్వర్యంలో విదుషీమణి జయప్రద రామమూర్తి వేణు గాన కచేరీ జరిగింది.
హంసధ్వని,మాయామాళవగౌళ, కళానిధి, కల్యాణి, హిందోళ రాగాలులోని కృతులతో సభను రంజింపచేశారు.
సింహేంద్రమధ్యమం రాగాన్ని ప్రధాన అంశంగా రాగంతానంపల్లవితో ఆకట్టుకున్నారు.
కదనకుతూహల, సిందుభైరవి, మధ్యమావతి రాగాలలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. వీరికి వైలెన్ పై పవన్ సింగ్, మృదంగం శ్రీకాంత్, ఘటం మల్లికార్జున సహకారం అందించారు సంస్థ అధ్యక్షులు శంకర్ బాలా, కార్యదర్శి యన్.రామమూర్తి కళాకారులను అభినందించారు. ప్రముఖ వ్యాఖ్యాత, నటులు బుర్రా మోహనకృష్ణ జయప్రద రామమూర్తిని సత్కరించారు.-