అమీన్పూర్ లో గుట్టు రట్టైన మత్తు వ్యాపారం ఎండిఎంఏ 10.50.. రెండు ఫోన్లు స్వాధీనం ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలింపు
అమ్మీన్ పూర్;సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత సింథటిక్ డ్రగ్ ఎం డి ఎం ఏ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చాక చక్యంగా పట్టుకున్నారు. నిందితులు హృతిక్ డి పాటిల్, (26) కర్ణాటక, సిద్ధార్థ (25) పాష మైలారం గా గుర్తించారు. వారి వద్ద నుంచి పది 10. 50 గ్రాములు ఎండిఎంఏ విలువ సుమారు 1.26.000 మరియు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విశ్వాసనీయ సమాచారం మేరకు అమీన్పూర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు రహస్యంగా మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు పోలీసులకు నమ్మదగ సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందం తో తనిఖీలు చేపట్టారు. అనుమానస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద 10.50 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ బయటపడింది. ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి వివరాల ప్రకారం ఇద్దరిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరపరిచి రిమాండ్ కు తరలించాం అని తెలిపారు.