ఓటు చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన–ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ;ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ఓటు హక్కు పవిత్రతను కాపాడాలనే లక్ష్యంతో ఏఐసీసీ (అఖిల భారత కాంగ్రెస్ కమిటీ) పిలుపు మేరకు ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఓటు చోరీ నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు మన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి ఢిల్లీకి చేరుకున్న సుమారు 150 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని, కానీ కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గుతూ వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు కలగకుండా ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటు చోర్–మోదీ హటావో, భారత్ బచావో” అనే నినాదాలతో నిరసన బ్యానర్లు ప్రదర్శిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. ప్రజల ఓటు హక్కును కాపాడటం, రాజ్యాంగ విలువలను పరిరక్షించడం, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు మరియు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు