నూజివీడు లో 72.30 శాతం పోలింగ్
నూజివీడు, మేజర్ న్యూస్ : మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. పట్టణంలో మొత్తం 72.30 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 31,055 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పోలింగ్ ప్రక్రియ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌కు తరలించి భద్రపరిచేందుకు పోలీస్ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి 18 వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు స్థానిక పిజి సెంటర్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏడు గంటల నుంచి ఓటర్లు బారులు తీరారు.