BREAKING
ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుక మేము సైతం సోమాజిగూడలో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఇంటింటి ప్రచారం.... నిస్వార్థ ఉద్యమకారుడిని కోల్పోయాం.. పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం! ఏకగ్రీవంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఎన్నిక అధ్యక్షుడిగా ఎ. శ్రీనివాస్ , ఉపాధ్యక్షుడు గా ముఖ్తార్ అహ్మద్ సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలి పూల్స్‌లో అజేయంగా నిలిచిన టైగర్స్ మరియు ఆర్టిస్ట్స్ - హెచ్‌పిఆర్‌సి అరీనా పోలో టోర్నమెంట్ 2026 అమరుల ఆశయ సాధనకు ఐక్య ఉద్యమాలే ఆయుధం! నగర పంచాయతీ ఎన్నిక లు ప్రశాంత్ ఆదర్శ కుటుంబం’ విడుదలతో వెంకీ అభిమానుల సందడి! వెంకటేశ్వర డివిజన్‌లోని సుగ్దేవ్ నగర్ లో ఎం.జి.ఆర్ పర్యటన వేములవాడ భీమేశ్వర స్వామివారి సేవలో ‘కితకితలు’ గీతా సింగ్ గణపతి సచ్చిదానంద స్వామీజీని దర్శించుకున్న రాజ్‌ ఠాకూర్‌ దంపతులు! ఆర్టీసీ బ్రెడ్ విన్నర్ ఉద్యోగులకు రెగ్యులర్‌ కొలువులు అలరించిన జయప్రద రామమూర్తి వేణు గానం

జాహ్నవి గెలుపే లక్ష్యంగా పువ్వాడి ఎన్నికల ప్రచార పర్వం

Select Suryaa Now
జాహ్నవి గెలుపే లక్ష్యంగా పువ్వాడి ఎన్నికల ప్రచార పర్వం

- గ్రామగ్రామాన నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు

- ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ మద్దతు అభ్యర్థన

- అఖండ మెజార్టీ సాధనకు విస్తృత కార్యాచరణ

పామూరు, మేజర్ న్యూస్ : నవంబర్ 5న జరగనున్న జడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి  బైరెడ్డి జాహ్నవి రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు. అభ్యర్థి విజయమే ధ్యేయంగా గ్రామస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారానికి పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ప్రచార కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. స్వయంగా ప్రచారంలో పాల్గొంటూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని జాహ్నవి రెడ్డికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయానికి సహకరించాలని కోరుతున్నారు. గ్రామాల్లో పార్టీకి ఉన్న ప్రజా మద్దతును ఓట్ల రూపంలో మలుచుకునేలా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచిస్తున్నారు. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి అభ్యర్థి గెలుపు ఆవశ్యకతను వివరించాలని ప్రచారంలో ఎలాంటి అలసత్వం లేకుండా బాధ్యతగా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల పోలింగ్ వరకు గ్రామాల్లో ప్రచారాన్ని మరింత విస్తృతం చేసి జాహ్నవి రెడ్డికి భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా పువ్వాడి వెంకటేశ్వర్లు ముందుకు సాగుతున్నారు.