నాగాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం భైరవి హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య సేవలు
సంగారెడ్డి;నాగాపూర్ గ్రామంలో భైరవి హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నటి భైరవి సహకారంతో ముషీరాబాద్ కేర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్ గౌడ్, ఉపసర్పంచ్ ప్రకాష్, పంచాయతీ కార్యదర్శి జగన్, వార్డు సభ్యులు నాగరాజు, మధు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకునేలా ప్రజాప్రతినిధులు కృషి చేశారు.గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.