BREAKING
ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుక మేము సైతం సోమాజిగూడలో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఇంటింటి ప్రచారం.... నిస్వార్థ ఉద్యమకారుడిని కోల్పోయాం.. పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం! ఏకగ్రీవంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఎన్నిక అధ్యక్షుడిగా ఎ. శ్రీనివాస్ , ఉపాధ్యక్షుడు గా ముఖ్తార్ అహ్మద్ సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలి పూల్స్‌లో అజేయంగా నిలిచిన టైగర్స్ మరియు ఆర్టిస్ట్స్ - హెచ్‌పిఆర్‌సి అరీనా పోలో టోర్నమెంట్ 2026 అమరుల ఆశయ సాధనకు ఐక్య ఉద్యమాలే ఆయుధం! నగర పంచాయతీ ఎన్నిక లు ప్రశాంత్ ఆదర్శ కుటుంబం’ విడుదలతో వెంకీ అభిమానుల సందడి! వెంకటేశ్వర డివిజన్‌లోని సుగ్దేవ్ నగర్ లో ఎం.జి.ఆర్ పర్యటన వేములవాడ భీమేశ్వర స్వామివారి సేవలో ‘కితకితలు’ గీతా సింగ్ గణపతి సచ్చిదానంద స్వామీజీని దర్శించుకున్న రాజ్‌ ఠాకూర్‌ దంపతులు! ఆర్టీసీ బ్రెడ్ విన్నర్ ఉద్యోగులకు రెగ్యులర్‌ కొలువులు అలరించిన జయప్రద రామమూర్తి వేణు గానం

శ్రీ మఠంలో 16 ఏళ్లలోపు చిన్నారులకు ఆయుర్వేద వైద్య సేవలు..

Select Suryaa Now
శ్రీ మఠంలో 16 ఏళ్లలోపు చిన్నారులకు ఆయుర్వేద వైద్య సేవలు..


మంత్రాలయం, సూర్య ప్రతినిధి  
కర్నూలు జిల్లా మంత్రాలయంలో వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం శ్రీమతం ఆధ్వర్యంలో 16 సంవత్సరాల లోపు పిల్లలకు ఆయుర్వేద వైద్య చికిత్సలను శ్రీ మఠం పీఠాధిపతులు
శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ దివ్య ఆశీస్సులతో శ్రీ సుజయేంద్ర ఆరోగ్యశాలలో ఆదివారం 16 ఏళ్లలోపు చిన్నారులకు ఉచిత సువర్ణప్రాశన కార్యక్రమం నిర్వహించారు. సంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానాలపై అవగాహన కల్పించడంతో పాటు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
సంప్రదాయ ఆయుర్వేద విధానంలో భాగమైన సువర్ణప్రాశన చిన్నారుల రోగనిరోధక శక్తి, జ్ఞాపకశక్తి, మేధో వికాసం, సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉచిత వైద్య సేవలను వినియోగించుకునేందుకు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తమ పిల్లలను తీసుకొచ్చారు.
సీఎంఓ డాక్టర్ సుధీంద్ర, కోఆర్డినేటర్ పి. విజయేంద్ర పర్యవేక్షణలో డాక్టర్ అంబాదాస్ కులకర్ణి, డాక్టర్ యేల్కూర్ యశస్విని వైద్యుల మార్గదర్శకత్వంలో కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, స్థానిక ప్రజల ఆరోగ్య సంక్షేమానికి మఠం అందిస్తున్న సేవల్లో భాగంగా ఈ కార్యక్రమం కొనసాగిందని నిర్వాహకులు పేర్కొన్నారు.
నల్లారెడ్డి మంత్రాలయం సూర్యప్రతినిధి కర్నూలు జిల్లా