కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గుంతపల్లి సర్పంచ్ అనంత్ రెడ్డి తిరుమల శ్రీవారి ప్రసాదం అందజేత
కొండాపూర్;బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను గుంతపల్లి సర్పంచ్ పడమటి అనంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కోకాపేటలోని కేటీఆర్ నివాసంలో ఆదివారం ఆయనను కలిసి తిరుపతి నుంచి తీసుకొచ్చిన శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.ఈ సందర్భంగా అనంత్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని యువత పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రజల్లోకి వెళ్లి పార్టీ అధికారం లో ఉన్నపుడు ప్రజలకు చేసిన పనులను విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారని తెలిపారు