ఇండియా కూటమి నిరసన కార్యక్రమానికి కోహిర్ కాంగ్రెస్ నేత ముజఫర్ హుస్సేన్ హాజరు
కోహిర్;ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కోహిర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ముజఫర్ హుస్సేన్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు పలువురు ఏఐసీసీ ముఖ్య నాయకులను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి చేపడుతున్న కార్యక్రమాలు, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం తదితర అంశాలపై నాయకులతో చర్చించినట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు తెలిపారు.కోహిర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ముజఫర్ హుస్సేన్ ఢిల్లీ పర్యటన చేపట్టడం, రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులను కలవడం స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తిని కలిగించింది.