కొల్చారంలో పెద్దమ్మ తల్లి ఆలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవం
కొల్చారం …మండల కేంద్రమైన కొల్చారంలో ఆదివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి ఆలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గడపను ప్రతిష్ఠించారు. ప్రతి ఇంటి నుండి రాగి కలశం లో నీళ్లు, పసుపు, కుంకుమ, పువ్వులు, కొబ్బరికాయలు తెచ్చి స్త్రీలు పెద్ద ఎత్తున భక్తిశ్రద్ధలతో గడప ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఉప సర్పంచ్ కొరంపల్లి రాణి గోపి, ఆశన్న గారి అంజయ్య, ఆర్కేల నాగరాజు, తెనుగు శేఖర్, ఎండుగుల శేఖర్, సార సుదర్శన్, నేరల్ల సత్యనారాయణ, ఎండుగుల యాదగిరి,కుమ్మరి నాగరాజు, ఆశన్న గారి శ్రీశైలం, ఎండుగుల అంజయ్య, శ్రీశైలం, కృష్ణ, భూమేష్, యాదగిరి, రామకృష్ణ, చింతల యాదగిరి,బాల్ రాజ్, కృష్ణ, మల్లేశం, బాణయ్య, శ్రీరామ్,చంటయ్య, రాములు, జటవోయిన రాజు, శ్రీశైలం, పోచయ్య, సంగమేశ్వర్, అంకం సత్తయ్య,దత్తు,దుర్గయ్య, మాజీ సర్పంచ్ రాజగౌడ్, తిమ్మన్న గారి ఆంజనేయులు, రామకృష్ణ గౌడ్, చౌరి గారి చిన్న రాములు, సంజీవ్ రావు ,చెన్నయ్య,రాజిరెడ్డి, కమ్మరి దశరథ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.