బొల్లారం డివిజన్ లో పార్కింగ్ లేకుండా అక్రమ నిర్మాణాలు
జిన్నారం;బొల్లారం డివిజన్ పరిధిలో నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బొల్లారం మున్సిపాలిటీ నుంచి జిహెచ్ఎంసి లో మారిన నిబంధనల ఉల్లంఘన జోరుగా సాగుతుందని, కొంతమంది స్టీల్ ప్లస్ టు అనుమతులు తీసుకొని ఎలాంటి పార్కింగ్ లేకుండా, బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. స్థానిక బొల్లారం డివిజన్ లో మరి కొంతమంది ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతూ యదేచ్చగా అక్రమ కట్టడాలు కడుతున్నారు. అనుమతులు ఉల్లంఘన జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేయకుండా భారీ నిర్మాణాలు చేపడుతున్నా కనీసం అటువైపుగా టౌన్ ప్లానింగ్ అధికారులు చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని గుసగుసలాడుకుంటున్నారు. జిహెచ్ఎంసి లో చేపడుతున్న నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్, డివిజన్ అధికారులు తనిఖీలు జరిపి విచారణ చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు తూచా తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.