"అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం - కాకాణి"
నెల్లూరు, మేజర్ న్యూస్ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసిన నివాళులు అర్పించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి
కాకాణి మెయిన్ పాయింట్స్..
అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఫలితంగానే తెలుగు ప్రజలకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తెలుగు భాష, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మహనీయుడు పొట్టి శ్రీరాములు .
పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. భావితరాలకు ఆయన జీవితం గొప్ప స్ఫూర్తిదాయకం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. తెలుగు ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన త్యాగాన్ని ఎప్పటికీ మరువలేం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఆశయాలను గుర్తుచేసుకుంటూ, వాటి సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మహనీయుల త్యాగాల ఫలితంగా మనకు లభించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తెలుగు జాతి చరిత్రలో పొట్టి శ్రీరాములు పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, తెలుగు ప్రజల ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందించింది. పొట్టి శ్రీరాములు త్యాగ స్ఫూర్తి, వైఎస్సార్ ప్రజాసేవా ఆశయాలు, జగనన్న సంక్షేమ పాలనా విధానాలు మనకు ఎల్లప్పుడూ ఆదర్శం కావాలి. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలను స్మరించుకుంటూ, వైఎస్ రాజశేఖర రెడ్డి చూపిన ప్రజాసేవా మార్గంలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజల కోసం నిరంతరం పోరాడుతాం. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని, సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తున్నాం.