BREAKING
కొడుకు పుట్టినరోజు వేడుకల్లో సేవా కార్యక్రమం.. బాల బాలికలకు సైకిళ్ల పంపిణీ నాగాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం భైరవి హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య సేవలు ఇండియా కూటమి నిరసన కార్యక్రమానికి కోహిర్ కాంగ్రెస్ నేత ముజఫర్ హుస్సేన్ హాజరు అమీన్పూర్ లో గుట్టు రట్టైన మత్తు వ్యాపారం ఎండిఎంఏ 10.50.. రెండు ఫోన్లు స్వాధీనం ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలింపు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికలు నిర్వహించడం చంద్రబాబు నియంతృత్వానికి నిదర్శనం సిద్దేశ్వరాలయంలో ఉజ్జయిని జగద్గురు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు బీఆర్ఎస్ సర్పంచులను అవమానిస్తే సహించేది లేదు.. ఆందోళన చేపడతాం: మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వైకాపాను ఆదరించాలి: మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ​దేవనబండ, ఎంపీటీసీ-7 స్థానాల్లో వైకాపా ప్రచారం బొల్లారం డివిజన్ లో పార్కింగ్ లేకుండా అక్రమ నిర్మాణాలు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గుంతపల్లి సర్పంచ్‌ అనంత్ రెడ్డి తిరుమల శ్రీవారి ప్రసాదం అందజేత కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలి–: రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి శ్రీ మఠంలో 16 ఏళ్లలోపు చిన్నారులకు ఆయుర్వేద వైద్య సేవలు.. కొల్చారంలో పెద్దమ్మ తల్లి ఆలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవం నూజివీడు లో 72.30 శాతం పోలింగ్

నాగర్‌కర్నూల్‌లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వినూత్న నిరసన

Select Suryaa Now
నాగర్‌కర్నూల్‌లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వినూత్న నిరసన

సూర్య ప్రాంతీయ డెస్క్: నాగర్‌కర్నూల్ జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మె ఆదివారంతో 20వ రోజుకు చేరుకుంది. తమ సమన్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఉద్యోగులు కార్లు శుభ్రం చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కోవిడ్ క్లిష్ట సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలందించి వేలాది మంది ప్రాణాలను కాపాడిన తమ చేతులకు, నేడు ఉద్యోగ భద్రత కరువై కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల విజయవంతమైన అమలులో తాము కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, తమ సేవలకు సరైన గుర్తింపు లభించడం లేదని ఆందోళన చెందారు.

ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎం జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఎన్‌హెచ్‌ఎం పరిధిలోని 78 కేడర్లలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించడమే తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 'సమాన పనికి సమాన వేతనం' సూత్రాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల పిల్లల చదువులు, కుటుంబ పోషణ మరియు వైద్య ఖర్చులు మోయలేని భరంగా మారాయని వాపోయారు. 20 రోజులుగా శాంతియుత మార్గంలో నిరసనలు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం శోచనీయమని విమర్శించారు.

ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తక్షణమే స్పందించి ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ పట్ల జాలి చూపాల్సిన అవసరం లేదని, తాము అందించిన సుదీర్ఘ సేవలను గుర్తించి న్యాయమైన ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరారు. 78 కేడర్ల ఉద్యోగులను క్రమబద్ధీకరించి తమ కుటుంబాలకు భరోసా కల్పించేంత వరకు శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ వినూత్న నిరసన కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ నాయకులు, జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.