BREAKING
ఓటు చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన–ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి కొడుకు పుట్టినరోజు వేడుకల్లో సేవా కార్యక్రమం.. బాల బాలికలకు సైకిళ్ల పంపిణీ నాగాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం భైరవి హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య సేవలు ఇండియా కూటమి నిరసన కార్యక్రమానికి కోహిర్ కాంగ్రెస్ నేత ముజఫర్ హుస్సేన్ హాజరు అమీన్పూర్ లో గుట్టు రట్టైన మత్తు వ్యాపారం ఎండిఎంఏ 10.50.. రెండు ఫోన్లు స్వాధీనం ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలింపు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికలు నిర్వహించడం చంద్రబాబు నియంతృత్వానికి నిదర్శనం సిద్దేశ్వరాలయంలో ఉజ్జయిని జగద్గురు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు బీఆర్ఎస్ సర్పంచులను అవమానిస్తే సహించేది లేదు.. ఆందోళన చేపడతాం: మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వైకాపాను ఆదరించాలి: మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ​దేవనబండ, ఎంపీటీసీ-7 స్థానాల్లో వైకాపా ప్రచారం బొల్లారం డివిజన్ లో పార్కింగ్ లేకుండా అక్రమ నిర్మాణాలు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గుంతపల్లి సర్పంచ్‌ అనంత్ రెడ్డి తిరుమల శ్రీవారి ప్రసాదం అందజేత కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలి–: రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి శ్రీ మఠంలో 16 ఏళ్లలోపు చిన్నారులకు ఆయుర్వేద వైద్య సేవలు.. కొల్చారంలో పెద్దమ్మ తల్లి ఆలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవం

రాష్ట్రానికి పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు తుఫాను ప్రభావంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Select Suryaa Now
రాష్ట్రానికి పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు  తుఫాను ప్రభావంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి, మేజర్‌న్యూస్‌ :

 రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంపై తుఫాను ప్రభావం, వర్షాలు, గాలుల తీవ్రత, జలాశయాల నిర్వహణ అంశాలతో పాటు వివిధ శాఖలు చేపట్టాల్సిన ముందస్తు కార్యాచరణపై సమీక్షించారు. తుఫాను సహాయక చర్యలపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తుఫాను ముప్పు  నెలకొనడంతో సోమవారం నాటి తన ఢిల్లీ పర్యటనను కూడా రద్దు చేసుకున్నట్టు సీఎం తెలిపారు.

నవంబర్ 3న తీరం దాటే అవకాశం

ప్రస్తుత వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా, అనంతరం తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నవంబర్ 2 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని, నవంబర్ 3వ తేదీ ఉదయం బాపట్ల సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటొచ్చని తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 100–110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. తుఫాన్ కారణంగా నవంబర్ 2న దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు... అలాగే, నవంబర్ 3, 4 తేదీల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అత్యంత భారీ వర్షాల అంచనా ఉన్న 20 మండలాల్లో ఏలూరు జిల్లాలో 9, కృష్ణా జిల్లాలో 5, ఎన్టీఆర్ జిల్లాలో 5, బాపట్ల జిల్లాలో ఒకటి ఉన్నాయన్నారు. నవంబర్ 3న జిల్లాల వారీగా అంచనా వేసిన సగటు వర్షపాతం వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఏలూరు జిల్లాలో సుమారు 179 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లాలో 163 మి.మీ., ఎన్టీఆర్ జిల్లాలో 161 మి.మీ., పశ్చిమ గోదావరి జిల్లాలో 147 మి.మీ., గుంటూరు జిల్లాలో 119 మి.మీ., బాపట్ల జిల్లాలో 104 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

బుడమేరు సహా పలు చోట్ల వరద ముప్పు

భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరు దగ్గర నవంబర్ 3న సుమారు 32,500 క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఎర్రకాల్వ, గోనెలవాగు, జల్లేరు, పంపా తదితర జలాశయాల్లో కూడా భారీ వరద వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి వివరించారు. తుఫాను ప్రభావంతో బలమైన గాలులు వీచడం వల్ల 12 జిల్లాల్లో సుమారు 12,102 నుంచి 15,128 విద్యుత్ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన మానవ వనరులు, పరికరాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి అవసరమైన సిబ్బందిని, సామగ్రిని ముందుగానే ప్రభావిత ప్రాంతాలకు తరలించి అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ స్తంభాలు పడిపోయిన సందర్భాల్లో ఎన్ని గంటల్లో పునరుద్ధరణ చేపట్టగలుగుతాం, ఎప్పటిలోగా విద్యుత్ సరఫరా అందించగలుగుతామనే విషయంపై స్పష్టమైన కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమాచారాన్ని ప్రజలకు కూడా తెలియజేసే పరిస్థితి ఉండాలని సూచించారు.

ప్రతి 4 గంటలకు తుఫాను పరిస్థితిపై బులెటిన్

తుఫాను ప్రభావంపై ప్రతి నాలుగు గంటలకు ఒకసారి బులెటిన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టెలికాం నెట్‌వర్క్ సంస్థలు ముందస్తు చర్యలు తీసుకుని మొబైల్ సిగ్నల్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సంస్థలను ముందుగానే అప్రమత్తం చేసి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అర్నబ్ తుఫాను సమయంలో నెట్‌వర్క్ సంస్థలు మరింత ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో అర్నబ్ తుఫాను వల్ల జరిగిన నష్టం, సహాయక చర్యల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు రాత్రికి అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.