BREAKING
వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ రిలీజ్ డేట్.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలివే ఎల్‌నినో ముప్పును ముందుగానే అంచనా వేసి.. నీటి భద్రతకు జిల్లా సమగ్ర కార్యాచరణ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కిటకిట: - స్వయంగా ఏర్పాట్లను పరిశీలించిన ఈవో ఆర్టీసీ బస్సు ప్రారంభించిన సర్పంచ్ పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: అమీనుద్ధీన్, భాగ్యానంద్ ఖాకీ నిఘాపై దొంగల"చెయ్యి"- రాజీవ్‌ రహదారిపై రెచ్చిపోయిన స్నాచర్లు అమిత్ షా రాకతో కాంగ్రెస్ లో గుబులు.... సింగరేణిలో రూ.330 కోట్ల సోలార్ ప్లాంట్ లకు గ్రహణం...!!! ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుక మేము సైతం సోమాజిగూడలో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఇంటింటి ప్రచారం.... నిస్వార్థ ఉద్యమకారుడిని కోల్పోయాం.. పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం! ఏకగ్రీవంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఎన్నిక అధ్యక్షుడిగా ఎ. శ్రీనివాస్ , ఉపాధ్యక్షుడు గా ముఖ్తార్ అహ్మద్ సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలి పూల్స్‌లో అజేయంగా నిలిచిన టైగర్స్ మరియు ఆర్టిస్ట్స్ - హెచ్‌పిఆర్‌సి అరీనా పోలో టోర్నమెంట్ 2026

పోలింగ్ సరళిని పరిశీలించిన తారక్ నాథ్ రెడ్డి

Select Suryaa Now
పోలింగ్ సరళిని పరిశీలించిన తారక్ నాథ్ రెడ్డి

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా తనయుడు, యువ నాయకుడు బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి, అక్కడ జరుగుతున్న ఓటింగ్ సరళిని, ఎన్నికల నిర్వహణ తీరును గమనించారు.  ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తారక్ నాథ్ రెడ్డి వివిధ కేంద్రాలను సందర్శించి, పోలింగ్ పరిస్థితులను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగుతున్న తీరును గమనించారు.  ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డులకు సంబంధించి 30 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ ఎన్నికల బరిలో నిలిచిన కూటమి అభ్యర్థుల విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తున్నారు.  పోలింగ్ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని నాయకులు కోరుతున్నారు. పోలింగ్ కేంద్రాల సందర్శనలో భాగంగా తారక్ నాథ్ రెడ్డి ఎన్నికల సరళిని పరిశీలించారు.