BREAKING
ఓటు చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన–ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి కొడుకు పుట్టినరోజు వేడుకల్లో సేవా కార్యక్రమం.. బాల బాలికలకు సైకిళ్ల పంపిణీ నాగాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం భైరవి హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య సేవలు ఇండియా కూటమి నిరసన కార్యక్రమానికి కోహిర్ కాంగ్రెస్ నేత ముజఫర్ హుస్సేన్ హాజరు అమీన్పూర్ లో గుట్టు రట్టైన మత్తు వ్యాపారం ఎండిఎంఏ 10.50.. రెండు ఫోన్లు స్వాధీనం ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలింపు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికలు నిర్వహించడం చంద్రబాబు నియంతృత్వానికి నిదర్శనం సిద్దేశ్వరాలయంలో ఉజ్జయిని జగద్గురు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు బీఆర్ఎస్ సర్పంచులను అవమానిస్తే సహించేది లేదు.. ఆందోళన చేపడతాం: మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వైకాపాను ఆదరించాలి: మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ​దేవనబండ, ఎంపీటీసీ-7 స్థానాల్లో వైకాపా ప్రచారం బొల్లారం డివిజన్ లో పార్కింగ్ లేకుండా అక్రమ నిర్మాణాలు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గుంతపల్లి సర్పంచ్‌ అనంత్ రెడ్డి తిరుమల శ్రీవారి ప్రసాదం అందజేత కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలి–: రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి శ్రీ మఠంలో 16 ఏళ్లలోపు చిన్నారులకు ఆయుర్వేద వైద్య సేవలు.. కొల్చారంలో పెద్దమ్మ తల్లి ఆలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవం

పేదల వైద్యానికి నీలిమ హాస్పిటల్‌ భరోసా కల్పిస్తోంది : మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి

Select Suryaa Now
పేదల వైద్యానికి నీలిమ హాస్పిటల్‌ భరోసా కల్పిస్తోంది : మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి
ఘట్‌కేసర్ రూరల్, మేజర్ న్యూస్ : పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నీలిమ హాస్పిటల్ యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమని మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పలో ఆదివారం డివిజన్ బీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు కొమ్ముల ప్రశాంత్ ఆధ్వర్యంలో నీలిమ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండల్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు 50 శాతం రాయితీతో వైద్య కార్డులు, ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు ఉచిత వైద్య కార్డులు అందించడం ద్వారా నీలిమ హాస్పిటల్ ప్రజలకు వైద్య సేవలను చేరువ చేస్తోందన్నారు. ఈ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యానికి దూరమయ్యే పేదలకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ శిబిరంలో వెయ్యి మందికి పైగా ప్రజలు వైద్య సేవలను వినియోగించుకున్నట్లు నీలిమ హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో పోచారం మాజీ ఉపసర్పంచ్ ఆకిటి బాల్ రెడ్డి, రాష్ట్ర గిరిజన నాయకుడు జితేందర్ నాయక్, అబ్బవతిని నర్సింహ, కే.ఎం.రెడ్డి, బోయపల్లి రాజేశ్వర్ రెడ్డి, పాశం లక్ష్మణ్ యాదవ్, సతీష్, ఆసుపత్రి సిబ్బంది భారత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.