గంజాయి సేవిస్తున్న ఆరుగురు వ్యక్తుల గుర్తింపు – మరో ఇద్దరి వద్ద పావు కిలో గంజాయి స్వాధీనం**గంజాయి సేవించిన ఆరుగురిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు – గంజాయి కలిగి ఉన్న ఇద్దరికి రిమాండ్*
సూర్య దమ్మపేట,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజు, ఐపీఎస్ఆదేశాల మేరకు, పాల్వంచ డీఎస్పీ ఆర్. సతీష్ కుమార్ సూచనల మేరకు దమ్మపేట పోలీసులు మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
31.10.2026న దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై బి. రాజేష్ కుమార్ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఆర్లపెంట గ్రామ శివారులోని స్మశాన వాటిక వద్ద గంజాయి సేవిస్తున్న ఆరుగురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ నిర్వహించిన యూరిన్ డ్రగ్ పరీక్షల్లో టిహెచ్సి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
అనంతరం విచారణలో లంకాలపల్లికి చెందిన పొట్ట సాయికుమార్ సాయి, నాగుపల్లికి చెందిన లవుడియా చైతన్య వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి మొత్తం పావు కిలో గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.12,500 ఉంటుందని తెలిపారు.
ఈ కేసులో గంజాయి సేవించిన ఆరుగురిని, గంజాయితో పట్టుబడిన ఇద్దరిని దమ్మపేట కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు గంజాయి సేవించిన ఆరుగురిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించగా, గంజాయి కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను రిమాండ్‌కు తరలించడం జరిగింది.గంజాయి సరఫరా, విక్రయాలకు సంబంధించిన ఇతర వ్యక్తుల వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యానికి, భవిష్యత్తుకు హానికరమని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, నిల్వ మరియు వినియోగానికి పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట సీఐ నాగరాజు, దమ్మపేట ఎస్సై బి. రాజేష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ దస్తగీర్ దమ్మపేట