BREAKING
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం మానవతా సేవకు ముందడుగు! భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్! టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రజావాణిలో పురుగు మందు డబ్బాతో రైతు ఆవేదన సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు అత్యంత కీలకం 'అధోజల మహాసముద్రాలు' బహుళ వ్యవస్థా క్షీణత వ్యాధి చికిత్స పరీక్షలను నిలిపివేసిన టెవా ఫార్మాస్యూటికల్స్ ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలి - ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోలక్ పల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్..

ఆత్మకూరులో ప్రజల నుంచి విశేష స్పందన - 28 వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం - మంత్రి ఆనం

Select Suryaa Now
ఆత్మకూరులో ప్రజల నుంచి విశేష స్పందన - 28 వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం - మంత్రి ఆనం

ఆత్మకూరు, మేజర్ న్యూస్  :    ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సరళిని ఆదివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. కూటమి నాయకులతో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియను సమీక్షించారు.  దాదాపు 70 శాతం పోలింగ్ కేంద్రాలను సందర్శించినట్లు ఆయన వెల్లడించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు పట్టణంలో ఎక్కడ చూసినా ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తోందని తెలిపారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌తో పాటు వార్డు కౌన్సిలర్లను గెలిపించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు.ఆత్మకూరు మున్సిపాలిటీలోని మొత్తం 28 వార్డుల్లో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌తో సహా ఎన్డీయే కూటమి అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఐక్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. 1, 6వ వార్డుల్లో టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తుండగా, 3వ వార్డును బీజేపీకి కేటాయించినట్లు వివరించారు. కౌన్సిలర్‌గా బీజేపీకి, ఛైర్‌పర్సన్‌గా టీడీపీకి ఓటు వేస్తూ ప్రజలు కూటమికి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు.మిగిలిన పోలింగ్ కేంద్రాలను కూడా సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తామని మంత్రి తెలిపారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో ఎన్డీయే కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.