BREAKING
విద్యార్థుల్లో బిసి ఉద్యమ స్ఫూర్తిని నింపుతాం :మన ఆలోచన సాధన సమితి (మాస్) అధ్యక్షుడు కటకం నర్సింగరావు మియాపూర్ 550 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాలకే కేటాయించాలి నివాసితులకు ఇంటి పట్టాలివ్వాలి మియాపూర్ భూములను ఉద్యమకారుల కుటుంబాలకు కేటాయించాలి.... గోపీనగర్ లో వెలగని వీధిదీపాలు.... పట్టించుకోని అధికారులు. బొప్పలి వెంకటేష్ యాదవ్‌కు సేవారత్న అవార్డు పరిశుభ్రతపై సీఎంసీ దృష్టి.. మాంసం దుకాణాలు, డెయిరీ ఫారాలపై అధికారుల తనిఖీలు యాదగిరి నగర్‌లో సీవరేజ్ పనులకు శ్రీకారం నీటి సంరక్షణలో భాగస్వాములుగా 437 మంది వాటర్ వారియర్లు గండిపేట కాండ్యూట్‌పై చురుగ్గా మరమ్మతు పనులు : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అయోధ్యలో బాలరాముడికి తెలంగాణ గవర్నర్ ప్రత్యేక పూజలు ఎమ్. ఎల్. ఏ., మర్రి రాజ శేఖర్ రెడ్డి కీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బోహ్రా కమ్యూనిటీ సభ్యులు. డిస్ట్రిక్ట్ మరియు ఎయిర్‌టెల్ మధ్య సహకారం ఎస్‌ఆర్ నాయక్ నగర్‌లో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి..పాత విద్యుత్ లైన్ల స్థానంలో ఏబీ కేబుళ్లు ఏర్పాటు చేయాలి.. ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి..వరగాని వాసుకు జన్మదిన శుభాకాంక్షలు రూ.40 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలి - ఎస్పీ శరత్ చంద్ర పవార్

Select Suryaa Now
ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలి - ఎస్పీ శరత్ చంద్ర పవార్

 

నల్లగొండ టౌన్, మేజర్ న్యూస్ : నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధి నుంచి వచ్చిన దాదాపు 34 మంది బాధితుల ఫిర్యాదులను సవివరంగా విన్నారు.
ఈ సందర్భంగా బాధితులు భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక లావాదేవీలు, మోసాలు, ఆస్తి సంబంధిత వివాదాలు తదితర అంశాలపై తమ ఫిర్యాదులను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రతి ఫిర్యాదును పరిశీలించిన ఎస్పీ, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలను నిర్ధారించి చట్టపరమైన నిబంధనల ప్రకారం సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయకుండా, ప్రతి కేసు పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలు నమ్మకంతో పోలీస్ శాఖ వద్దకు వస్తున్నందున వారి ఫిర్యాదులను గౌరవంగా స్వీకరించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం అందించాలని అధికారులకు సూచించారు.
గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా జిల్లా ఎస్పీని కలిసే అవకాశం కల్పిస్తున్నామని, ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతతో పరిశీలించి చట్ట పరిధిలో సత్వర పరిష్కారం అందిస్తామని ఎస్పీ తెలిపారు.