నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన
మాడ్గులపల్లి, మేజర్ న్యూస్: మాడ్గులపల్లి మండలంలోని నారాయణపురం గ్రామంలో సబ్ రేషన్ షాపు ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ ప్రజల తరఫున పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించగా, అధికారులు సానుకూలంగాస్పందించినట్లు భారత రాష్ట్ర సమితి నాయకులు తావిటి సైదులు తెలిపారు. గ్రామం లో రేషన్ షాపు లేకపోవడంతో వృద్ధు లు,ఒంటరిమహిళలు, వికలాంగులు,గ్రామ ప్రజలు రేషన్ సరుకుల కోసం సుమారు నాలుగు కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్, పౌర సరఫరాల శాఖఅధికారులు, మిర్యాలగూడ ఆర్డీవో,మాడ్గులపల్లి తహసీల్దార్‌లను పలుమా ర్లు కలిసి వినతిపత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు.గ్రామ ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకున్న అధికారులు సబ్ రేషన్ షాపు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.సోమవారంమరో మారు మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డిని కలిసి నారాయణపురం గ్రామ ప్రజ లు ఎదుర్కొంటున్న సమస్యను వివరించగా ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో గ్రామా నికి సబ్ రేషన్ షాపు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సైదులు వెల్లడించారు. సబ్ రేషన్ షాపు ఏర్పాటు అయితే నారాయణపురం గ్రామం లోని వృద్ధులు,వికలాంగులు, ఒంటరి మహిళలు, పేద కుటుంబాలకు రేషన్ సరుకులు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగనున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల పోరంమండల ఉపాధ్యక్షులు తావిటి లక్ష్మణ్, తావిటి అశోక్, తావిటి సతీష్, తదితరులు పాల్గొన్నారు.