BREAKING
ప్రశాంత్ నగర్ కాలనీలో రోడ్డు ప్రమాదాలు నివారించండి .. కర్కాటక రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani రాహుల్ గాంధీ కాబోయే దేశ ప్రధాని: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి బాలయ్య నగర్ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మిథున రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani కోమటికుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి..: ప్రజావాణిలో ఆకుల సతీష్ ఫిర్యాదు.. ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలి.. వృషభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ఠ..* *విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ* పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేష రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ఖైదీల మానసిక ఆరోగ్యానికి ‘ఉల్లాసం’ కార్యక్రమం ఫలించిన మేల్లగూడ గిరిజనుల పోరాటం... ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ మహా పాదయాత్ర బియ్యం అక్రమ వ్యాపారులపై 11 కేసులు నమోదు

ప్రజారోగ్యాన్ని స్ట్రెచర్‌పై పడుకోబెట్టిన తెలంగాణ ప్రభుత్వం!: డా శివ ప్రసాద్

Select Suryaa Now
ప్రజారోగ్యాన్ని స్ట్రెచర్‌పై పడుకోబెట్టిన తెలంగాణ ప్రభుత్వం!: డా శివ ప్రసాద్

 

*చౌటుప్పల్, మేజర్ న్యూస్:*

తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగం పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని సహస్ర ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా. చినుకని శివ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.వైద్యులు, నర్సింగ్ సిబ్బంది కొరత, మందుల లభ్యత సమస్యలు, వైద్య పరికరాల కొరత, మౌలిక సదుపాయాల లోపాలు ప్రజారోగ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయని పేర్కొన్నారు.ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వం.. ఆరోగ్యరంగాన్నే స్ట్రెచర్‌పై పడుకోబెట్టిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రచారాలకు పరిమితమైతే సామాన్యుల ప్రాణాలకు భరోసా ఎవరు ఇస్తారని ప్రశ్నించారు.ప్రభుత్వం వెంటనే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. పేదలకు గౌరవప్రదమైన, నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని స్పష్టం చేశారు.ఆరోగ్యరంగం బలహీనపడితే రాష్ట్ర అభివృద్ధి అర్థరహితం. ప్రజల ప్రాణాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడనాడాలి.