BREAKING
జీహెచ్‌ఎంసీ క్రీడా పోటీలు–2026 ప్రారంభం సిబిఎస్ఇ జాతీయ జిమ్నాస్టిక్ ఛాంపియన్‌షిప్ 2026 ప్రశాంత్ నగర్ కాలనీలో రోడ్డు ప్రమాదాలు నివారించండి .. కర్కాటక రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani రాహుల్ గాంధీ కాబోయే దేశ ప్రధాని: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి బాలయ్య నగర్ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మిథున రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani కోమటికుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి..: ప్రజావాణిలో ఆకుల సతీష్ ఫిర్యాదు.. ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలి.. వృషభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ఠ..* *విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ* పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేష రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ఖైదీల మానసిక ఆరోగ్యానికి ‘ఉల్లాసం’ కార్యక్రమం ఫలించిన మేల్లగూడ గిరిజనుల పోరాటం...

విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి .. అదనపు కలెక్టర్ సంగీత

Select Suryaa Now
విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ..  అదనపు కలెక్టర్ సంగీత

సంగారెడ్డి, : ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంధన వనరుల వినియోగంలో పొదుపు పాటిస్తూ, విద్యుత్ సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ సంగీత సూచించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో టీజీఆర్ఈడీసీఓ సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మిషన్ లైఫ్ – పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంగీత వివిధ శాఖల అధికారులతో కలిసి ఇంధన పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్, ఇంధన వినియోగంలో పొదుపు పాటించాలని సూచించారు. సహజ వనరులను సంరక్షిస్తూ పర్యావరణహిత జీవన విధానాలను అలవర్చుకోవాలని అన్నారు. అవసరం లేనప్పుడు విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, ఇతర విద్యుత్ ఉపకరణాలను నిలిపివేయాలని, విద్యుత్ ఆదా చేసే అధిక సామర్థ్యం కలిగిన ఉపకరణాలను వినియోగించాలని సూచించారు.బ్రిక్స్ - - సుస్థిర  జీవనశైలి వారోత్సవాల్లో -- భాగంగా నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా ఇంధన పరిరక్షణ, పర్యావరణ బాధ్యతాయుత జీవనశైలిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు టీజీఆర్ఈడీసీఓ జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా విద్యుత్ ఆదా చేసే విధంగా వినియోగించడం ద్వారా ఇంధనాన్ని పొదుపు చేయవచ్చని పేర్కొన్నారు. చిన్న చిన్న మార్పులతో పెద్ద ప్రయోజనాలు సాధించవచ్చని, ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అఖిలేష్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీష్, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లలిత దేవి, డీఏహెచ్‌ఓ వసంతకుమారి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.