అత్యాధునిక సాంకేతిక పరికరాలతో భూ రీ సర్వే --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్ ; అత్యాధునిక సాంకేతిక పరికరాలతో భూ రీ సర్వే చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు .సోమవారం కలెక్టర్ భూ రీ సర్వే పరికరాలను భూ సర్వే ఏ డి కిషన్, సంబధిత శాఖా ఉద్యోగులకు అందించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ రీ సర్వే లో కచ్చితత్వాన్ని అమలు చేయడానికి, పకడ్బందీగా సర్వే నిర్వహించడానికి, సమయ భావాన్ని తగ్గించి, పారదర్శకమైన భూ సర్వే కోసం అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఉపయోగపడతాయన్నారు
.