విద్యార్థులు భవిష్యత్తులో దేశానికి మంచి నాయకులుగా ఎదగాలి కలెక్టర్
మెదక్ ; ఉత్తమ పార్లమెంటరిన్ గా
అద్భుత ప్రతిభ సాధించిన ఆర్తి చంద్ర ను అభినందించిన జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో మాక్ పార్లమెంట్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని కలెక్టర్ ఘనంగా సత్కరించారు.సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..హైదరాబాద్‌లోని గోదావరి ఆడిటోరియంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 33 జిల్లాల నుండి మొత్తం 66 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ గా
మెదక్ జిల్లా శంకరంపేట ఆర్ మండలం తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని ఆర్తి చంద్రవ్యవహరించడం జరిగిందని రాష్ట్రస్థాయిలో జరిగిన అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో రాష్ట్ర సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ మదన్మోహన్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంటులో ప్రజాస్వామ్య వ్యవస్థ, పార్లమెంటరీ విధానాలపై అద్భుత ప్రదబి కనపరిచి ప్రథమ స్థానాన్ని దక్కించుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, పార్లమెంటరీ విధానాలపై యువతకు అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో దేశానికి మంచి నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.పదవ తరగతిలో రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంకు సాధించాలని భవిష్యత్తులో ఉన్నతస్థానాలకు ఎదగాలని సూచించారు
ఆర్తి చంద్రను ఆమెకు గైడ్ టీచర్ గా వ్యవహరించినవ్యవహరించినటువంటి లింగమయ్య పిజిటిని , పాఠశాల ప్రిన్సిపాల్ ను, వీరికి సహకరించిన సోషల్ ఫోరం బాధ్యులు నర్సింలు మరియు రవిబాబులను సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఏ ఎం ఓ సుదర్శన్ మూర్తి, సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు