ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం
-- అన్ని రంగాల ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ
మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి
హుజూర్ నగర్ రూరల్, మేజర్ న్యూస్ :
రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణకు సాగునీరు అందించకుండా ఆంధ్రాకు నీళ్లు తరలించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపించారు. అన్ని రంగాల ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని విమర్శించారు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయమని అడుగుతారని అన్నారు. ప్రజల్లోకి వెళ్లలేక కాంగ్రెస్ నాయకులు చాటేసారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కరువు వచ్చిందని, నీటిపై అవగాహన లేని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అని, కాలేశ్వరం ప్రాజెక్టుపై అవాకులు చవాకులు మాట్లాడుతూ అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు పల్లెలు పచ్చగా ఉన్నాయని, ప్రస్తుతం నెర్రెలవాసి ఆకాశం వైపు చూస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పాలన వస్తే మార్పు వస్తుందని అందరూ ఏదో గొప్పగా జరుగుతోందని ఆశ పడ్డారని, కానీ రైతులు, నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటాడుకుంటుందని అన్నారు. నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతుందని అందుకు నిదర్శనం ఇటీవల అధికారుల సస్పెండ్ చేయడమే అన్నారు. అనంతరం బి ఆర్ ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంలో దగాపడ్డారన్నారు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులు సైనికుల పనిచేసి బిఆర్ఎస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటె నర్సింహారెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. రానున్న పట్టబద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా ఓటు నమోదు అవుతుందని ఆయన రాశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించి పెద్ద ఎత్తున నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. Rechargeable ఎమ్మెల్సీ ఓటర్ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి కంచర్ల కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు పిల్లుట్ల రఘు, మాజీ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, బెల్లంకొండ అమర్ గౌడ్, జక్కుల నాగేశ్వరరావు, నగేష్ రాథోడ్, కడియం వెంకట్ రెడ్డి, రాపోలు నవీను, పాలేటి రామారావు కె.ఎల్.ఎన్.రెడ్డి, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.