ఘనంగా ఏ సీ సీ ఏ సక్సెస్ మీట్ 2026 - అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహణ
తెలంగాణ బ్యూరో ప్రతినిధి : వాణిజ్య, యాజమాన్య విద్యారంగంలో అగ్రగామి సంస్థ అయిన అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఏ జీ ఐ ), ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ (ఏ సీ సీ ఏ ) అభ్యసిస్తున్న విద్యార్థుల విజయాలను వేడుకగా జరుపుకోవడానికి సికింద్రాబాద్‌లోని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఏ సీ సీ ఏ సక్సెస్ మీట్ 2026ను నిర్వహించింది. అవినాష్ లెర్నింగ్ ద్వారా, ఈ సంస్థ భారతదేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య మరియు వృత్తిపరమైన అభ్యాస అవకాశాలను మరింతగా అందిస్తోంది. ఈ కార్యక్రమానికి ఎ సి సి ఏ ఇండియా డైరెక్టర్ మహమ్మద్ సాజిద్ ఖాన్ ముఖ్య అతిథిగా, మరియు ఏ సి సి ఏ ఇండియా, సౌత్ ఎడ్యుకేషన్ పార్టనర్ రిలేషన్‌షిప్ లీడ్ - ఆల్థియా లీ విశిష్ట అతిథిగా విచ్చేశారు. ఏ జీ ఐ ఛైర్మన్ డాక్టర్ అవినాష్ బ్రహ్మదేవర, మరియు అంతర్జాతీయ కార్యక్రమాల అధిపతి డాక్టర్ శ్రీకాంతలహరి సాగి, సంస్థ యొక్క విద్యావేత్తలతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ సి సి ఏ గోల్డ్ లెర్నింగ్ పార్టనర్‌గా, అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో ప్రస్తుతం 1,200 మందికి పైగా విద్యార్థులు ఏ సి సి ఏ చదువుతున్నారు. ఈ విజయ సమావేశంలో, తమ ఎ సి సి ఏ ప్రయాణంలో చక్కటి ఫలితాలను సాధించిన 200 మందికి పైగా విద్యార్థులను గుర్తించి, వారి అంకితభావాన్ని మరియు విద్యా పురోగతిని కొనియాడారు. ఈ సంస్థ యొక్క ఏ సి సి ఏ కమ్యూనిటీలో స్కిల్స్ స్థాయిలో అర్హత సాధించిన 70 మందికి పైగా విద్యార్థులు, 15 మందికి పైగా ఏ సి సి ఏ అఫిలియేట్‌లు మరియు 5 మందికి పైగా ఎ సి సి ఏ సభ్యులు కూడా ఉన్నారు.