BREAKING
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచాలి ..:వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మహీంద్రా అస్వితలో సదస్సు బ్రహ్మకుమారిస్ దీపాలి స్నేహ సమ్మేళనం విజయవంతం. ఏఐపీఎస్ఓ రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక జీహెచ్‌ఎంసీ క్రీడా పోటీలు–2026 ప్రారంభం సిబిఎస్ఇ జాతీయ జిమ్నాస్టిక్ ఛాంపియన్‌షిప్ 2026 ప్రశాంత్ నగర్ కాలనీలో రోడ్డు ప్రమాదాలు నివారించండి .. కర్కాటక రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani రాహుల్ గాంధీ కాబోయే దేశ ప్రధాని: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి బాలయ్య నగర్ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మిథున రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani కోమటికుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి..: ప్రజావాణిలో ఆకుల సతీష్ ఫిర్యాదు.. ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలి.. వృషభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ఠ..* *విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ* పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ఈరోజు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం

Select Suryaa Now
ఈరోజు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం

                              వందేళ్లకు పైగా పురాతన రాతి నిర్మాణ కాండ్యూట్‌పై లీకేజీల మరమ్మతులు

హైదరాబాద్ మేజర్ న్యూస్ ( సిటీ ప్రతినిధి):హైదరాబాద్ నగరానికి కృష్ణా, గోదావరి, సింగూరు–మంజీరా, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ తదితర జలవనరుల నుంచి జలమండలి ప్రతిరోజూ దాదాపు 560 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ) తాగునీటిని సరఫరా చేస్తోంది. ఇందులో గండిపేట (ఉస్మాన్‌సాగర్) నుంచి నగరానికి నీటిని సరఫరా చేసే 20 ఎంజీడీల సామర్థ్యం గల వందేళ్లకు పైగా పురాతనమైన రాతి నిర్మాణ కాండ్యూట్ (Conduit)పై సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. వీటిని అరికట్టేందుకు జలమండలి మరమ్మతు పనులు చేపట్టనుంది.

ఈ కాండ్యూట్ వందేళ్లకు పైగా పురాతనమైనది కావడంతో లీకేజీలను పూర్తిస్థాయిలో అరికట్టి, నీటి సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు మరమ్మతులు చేపడుతున్నారు.

ఈ పనులను నవంబర్ 3వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 4వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు నిర్వహించనున్నారు.

ఈ పాక్షిక అంతరాయం కేవలం గండిపేట నుంచి నీటిని సరఫరా చేసే 20 ఎంజీడీల కాండ్యూట్‌కు మాత్రమే పరిమితం. నగరానికి వివిధ జలవనరుల నుంచి సరఫరా చేస్తున్న మొత్తం 560 ఎంజీడీల నీటిలో ఈ కాండ్యూట్‌పై ఆధారపడిన ప్రాంతాల్లో మాత్రమే అంతరాయం ఏర్పడనుంది. సింగూరు–మంజీరా, కృష్ణా, గోదావరి తదితర ఇతర జలవనరుల నుంచి తాగునీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుంది.

తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగే ప్రాంతాలు:

1. గోషామహల్, కార్వాన్ సర్కిళ్లు (డివిజన్-13):
రెడ్‌హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, గోడేకీ ఖబర్, హిందీనగర్, అసెంబ్లీ, సెక్రటేరియట్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్‌నగర్, నాంపల్లి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాంతం, గన్‌ఫౌండ్రీ.
2. గోల్కొండ జోన్ (డివిజన్-14):
చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీ, ఓల్డ్ మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, అహ్మద్‌నగర్.
3. కవాడిగూడ సర్కిల్ (డివిజన్-17):
కవాడిగూడ, గాంధీనగర్ వార్డుల పరిధిలోని దోమలగూడ తదితర ప్రాంతాలు.
4. జూబ్లీహిల్స్ సర్కిల్ (డివిజన్-15):
బంజారాహిల్స్ వార్డు పరిధిలోని ప్రాంతాలు.
గండిపేట కాండ్యూట్‌పై చేపట్టనున్న మరమ్మతుల కారణంగా పైన పేర్కొన్న ప్రాంతాల్లో మాత్రమే తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. నగరవ్యాప్తంగా తాగునీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని జలమండలి స్పష్టం చేసింది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాల్లోని వినియోగదారులు ముందస్తుగా అవసరమైన నీటిని నిల్వ చేసుకుని, పొదుపుగా వినియోగించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.