నీటిని పొదుపు చేద్దాం – భవిష్యత్తును కాపాడుకుందాం
గోపాలపురం, మేజర్ న్యూస్:మండలంలోని చిట్యాల వేళ్ళచింతలగూడెం లే అవుట్ లలో గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు " సేవ్ వాటర్ సేవ్ ఫ్యూచర్ " అనే నినాదంతో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ మరియు పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా హౌసింగ్ ఏఈ రమేష్ మాట్లాడురూ, ప్రతి నీటి బొట్టు విలువైనదని, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఇంటి ఆవరణలో తప్పనిసరిగా ఇంకుడు గుంతను నిర్మించుకుని వర్షపు నీటిని ఒడిసిపట్టాలని లబ్ధిదారులకు వివరించారు.
అలాగే, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని కోరారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులు, సిబ్బంది చిన్నo లెనిన్, పాల్గొన్నారు.