పిల్లలమర్రి శివాలయాల్లో ప్రత్యేక పూజలు
సూర్యాపేట రూరల్: మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాల్లో సోమవారం స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. అనంతరం నూతన వస్త్రాలంకరణ, పుష్పార్చన బిల్వార్చన, నిరాజన మంత్రపుష్పం చేసి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. పట్టణ, పరిసర గ్రామాల ప్రజలు పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.