ప్రమాద బాధిత టీడీపీ నాయకుడికి చిన్నబాబు ఆర్థిక సహాయం.
చొల్లంగి శ్రీనివాస్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.15 వేల సాయం
ఆలమూరు మేజర్ న్యూస్ :ఆపదలో ఉన్న పార్టీ నాయకులకు అండగా నిలుస్తూ పెనికేరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వెంకటేశ్వర సంస్థల అధినేత ఈదర చిన్నబాబు తన సహృదయతను చాటుకున్నారు. ప్రమాదవశాత్తు గాయపడి కాలుకు శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ నాయకుడు చొల్లంగి శ్రీనివాస్‌ను ఆయన పరామర్శించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్య చికిత్సకు అవుతున్న ఖర్చుల నిమిత్తం రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనుకోని ప్రమాదంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఆర్థిక సహాయం అందించడం ద్వారా బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.కష్టాల్లో ఉన్నవారిని గుర్తించి, వారికి అవసరమైన సమయంలో సహాయ సహకారాలు అందించడం ద్వారా ఈదర చిన్నబాబు తన సేవాభావాన్ని చాటుకుంటున్నారని స్థానికులు పేర్కొన్నారు. ఆయన అందించిన ఆర్థిక సహాయంపై కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.