BREAKING
ప్రశాంత్ నగర్ కాలనీలో రోడ్డు ప్రమాదాలు నివారించండి .. కర్కాటక రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani రాహుల్ గాంధీ కాబోయే దేశ ప్రధాని: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి బాలయ్య నగర్ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మిథున రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani కోమటికుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి..: ప్రజావాణిలో ఆకుల సతీష్ ఫిర్యాదు.. ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలి.. వృషభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ఠ..* *విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ* పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేష రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ఖైదీల మానసిక ఆరోగ్యానికి ‘ఉల్లాసం’ కార్యక్రమం ఫలించిన మేల్లగూడ గిరిజనుల పోరాటం... ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ మహా పాదయాత్ర బియ్యం అక్రమ వ్యాపారులపై 11 కేసులు నమోదు

నిత్యావసర ధరల పెరుగుదలపై వైసీపీ వినూత్న నిరసన.. సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి?. --గిరిజాల బాబు

Select Suryaa Now
నిత్యావసర ధరల పెరుగుదలపై వైసీపీ వినూత్న నిరసన..  సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి?. --గిరిజాల బాబు

కడియం ,మేజర్ న్యూస్,:కూటమి ప్రభుత్వ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడియం గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు వినూత్న రీతిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
తోపుడు బండిపై బియ్యం, పప్పులు, నూనె, ఉల్లిపాయలు తదితర నిత్యావసర వస్తువులను ఉంచి, గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని ధరలు, ప్రస్తుత ధరల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ ప్రచారం చేపట్టారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని గిరిజాల బాబు డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, విద్యుత్ బిల్లులతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జడ్పీటీసీ అభ్యర్థి కొత్తపల్లి శివాజీ, ఎంపీటీసీ అభ్యర్థులు పెంకే రామకృష్ణ (1వ స్థానం), దాసరి చంద్రకళ (2వ స్థానం), గుడాల వీరమణి (3వ స్థానం), సాకా మరియమ్మ (4వ స్థానం)తో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.