స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై పిఓ ఏపీఓలకు 2 వ విడత 181 మందికి శిక్షణా కార్యక్రమం.
ఆలమూరు మేజర్ న్యూస్ :మండల కేంద్రమైన ఆలమూరులోని డాక్టర్ బొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పీఓ (PO), ఏపీఓ (APO)లకు సోమవారం రెండవ విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలమూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో) లక్ష్మీ ప్రత్యూష, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి (ఏఆర్వో), ఎంపీడీవో ఎ. రాజు ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 5వ తేదీన జరగబోయే ఎన్నికల నిమిత్తం మండలంలోని 51 పాఠశాలలో ఏరియాలో 77 పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేశామని 181 మంది కి ఎన్నికల విధుల నిర్వహణ, పోలింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల నియమ నిబంధనలు, పోలింగ్ కేంద్రాల్లో పాటించాల్సిన విధివిధానాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.
పిఓలు ఏపీవోలు అందరూ 4 తేదీ సాయంత్రానికి ఆ యా పోలింగు స్టేషన్ కి హాజర అవ్వాలని 5 వ తేదీన ఎలక్షన్ అయినా వెంటనే సాయంత్రం బాక్సులను కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు హాజరపరచాలని సూచించారు .ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు 1 బి అప్పాజీ ;2 ఎన్ రాజు ఎం ఓటీలు జీ చక్రవర్తి , వాసా దుర్గాప్రసాద్ , బి ఆర్ కె ప్రసాదు ఎన్నికల విధులకు కేటాయించిన పీఓలు, ఏపీఓలు, తదితరులు పాల్గొన్నారు._