BREAKING
మమితా బైజు అసలు పేరు నమిత కాదా.. బర్త్ సర్టిఫికెట్‌లో జరిగిన ఆ పొరపాటే ఆమెను స్టార్‌ను చేసిందా! గెలుపు దిశగా ఎన్డీఏ జడ్పిటిసి టిడిపి అభ్యర్థి దొండపాటి సుబ్బరాజు . విద్యార్థులు భవిష్యత్తులో దేశానికి మంచి నాయకులుగా ఎదగాలి కలెక్టర్ విజయోత్సవ సంబరాలకు ప్రజలు దూరంగా ఉండాలి : డిఎస్పీ శేషు వర్షాలకు వరి పంటకు తీవ్ర నష్టం.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు. ఎస్‌ఐఆర్‌-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి..... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఏలూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పటిష్ట ఏర్పాట్లు ప్రమాద బాధిత టీడీపీ నాయకుడికి చిన్నబాబు ఆర్థిక సహాయం. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో భూ రీ సర్వే --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పులిమామిడి గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలప్రారంభం స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై పిఓ ఏపీఓలకు 2 వ విడత 181 మందికి శిక్షణా కార్యక్రమం. శ్రీ మార్కండేశ్వర స్వామి భజన మండలి ఆధ్వర్యంలో లక్ష బిల్వార్చన వరుస తుఫాన్ల దెబ్బకు వరి రైతు విలవిల.. పంట నష్టం రైతుకు కన్నీళ్లు.. అమితాబ్ బచ్చన్‌కు జయ బచ్చన్ పెట్టిన ముద్దుపేరు: హరివంశ్‌ రాయ్ బచ్చన్ ఎందుకు వారించారంటే! సర్పంచ్ అభ్యర్థిగా సత్యవేణి ప్రజల ముందుకు.. అభివృద్ధికి అండగా ఉంటానన్న మాజీ ఎంపీటీసీ వీర వెంకటరావు

రావులపాలెం మండలంలో చిర్ల జగ్గిరెడ్డి విస్తృత పర్యటన

Select Suryaa Now
రావులపాలెం మండలంలో చిర్ల జగ్గిరెడ్డి విస్తృత పర్యటన

                                  జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా గ్రామగ్రామాన ఎన్నికల ప్రచారం

రావులపాలెం మేజర్ న్యూస్ :రావులపాలెం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల జడ్పీటీసీ అభ్యర్థి మల్లిడి లావణ్యతో పాటు వివిధ గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. తినడానికి తిండి కూడా భారంగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో, మహిళలకు వాగ్దానం చేసిన పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, రాప్తాడు ఘటన వంటి సంఘటనలు మహిళల రక్షణపై ప్రభుత్వ బాధ్యతను ప్రశ్నిస్తున్నాయని అన్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఎన్నికల ప్రక్రియలో అడ్డదారులు తొక్కడం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తుందని విమర్శించారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్ చేశారు.

ప్రజలారా.. ఒక్కసారి ఆలోచించండి. మీ సమస్యలపై స్పందించే అభ్యర్థులను ఆదరించండి. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని చిర్ల జగ్గిరెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.

ఈ పర్యటనలో పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.