andhrapradesh
మల్లేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇస్తున్నా ..
----పెదకాకాని గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా - --_ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర కుమార్
పెదకాకాని న్యూస్ :పెదకాకాని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇస్తున్న గ్రామంలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, ఇందుకోసం ప్రజలు సైకిల్ గుర్తుపై ఓటు వేసి జడ్పిటిసి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులకు సైకిల్ గుర్తు పై జనసేన పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులులకు గ్లాస్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ కోరారు. గ్రామంలో నిర్వహించిన పాదయాత్ర ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ..ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న పేదలకు పట్టాలు అందిస్తానని హామీ ఇచ్చారు .ప్రతి ఇంటి గడప వద్దకు సంక్షేమం చేరువ చేస్తానని తెలిపారు. ఎన్నికల బరిలో ఉన్న జడ్పిటిసి అభ్యర్థి దానబోయిన సునీత తో పాటు ఆరుగురు గ్రామంలోని ఎంపీటీసీలను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో పెదకాకాని గ్రామం ఆదర్శంగా ఉండేలా అభివృద్ధి చేసి మౌలిక వస్తువులు కల్పిస్తానని స్పష్టం చేశారు. గ్రామంలో గత ఐదేళ్లలో అధికారంలో ఉన్న నాయకులు గ్రామ అభివృద్ధికి ఏం చేశారో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కోరారు. గ్రామ అభివృద్ధిని పక్కనపెట్టి కేవలం అధికారం కోసం, రాజకీయ ఆధిపత్యం కోసం పోరాడారే తప్ప ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని అన్నారు.గ్రామంలో గతంలో స్వర్గీయ పుష్పరాజు చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ, గ్రామానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయన హయాంలోనే ప్రారంభమయ్యాయని తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను వివరించారు.గతంలో గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని, రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే నీరు వచ్చేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజూ తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించి సమస్యను చాలావరకు పరిష్కరించామని తెలిపారు. గ్రామంలో రహదారుల అభివృద్ధి, యాదవ సామాజికవర్గానికి అవసరమైన భవన నిర్మాణానికి సహకారం అందించామని పేర్కొన్నారు. గత రెండేళ్లలో గ్రామంలో తాగునీరు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గ్రామంలో ఇంకా పరిష్కరించాల్సిన మురుగునీటి సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆ బాధ్యతను తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పాత రహదారుల నుంచి గ్రామానికి వచ్చే మార్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.గతంలో ఎన్నికల సమయంలో జరిగిన సంఘటనలను గుర్తుచేస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని, ఎలాంటి దౌర్జన్యాలకు తావులేకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. తమది దౌర్జన్యాలు చేసే ప్రభుత్వం కాదని, ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెదకాకాని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వలివేటి మురళీకృష్ణ, రాష్ట్ర బీసీ సంఘ నాయకులు దర్శి భాస్కరరావు, పెదకాకాని మండల మైనార్టీ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్, టీడీపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.