BREAKING
మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు మరియు ప్రయోజనాలు! రణ్‌బీర్ కపూర్, యశ్ ప్రతిష్టాత్మక 'రామాయణం' చిత్రానికి బాంబే హైకోర్టు భారీ రక్షణ! కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవండి - తొప్పాటిపల్లి, తుమ్మిందపాళ్యంలో కంచెర్ల ప్రతిమ ,ప్రచారం - రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటు వేయండి. పనసపండు తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు.. షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవచ్చా? అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ అద్భుత సంచలనం: వన్డే ర్యాంకింగ్స్‌లో శ్రీలంకను వెనక్కి నెట్టి ఆరో స్థానానికి దూసుకెళ్లిన వైనం! రజినీకాంత్ జైలర్ 2 బాక్సాఫీస్ కలెక్షన్లు: సోమవారం భారీ పతనం అయినప్పటికీ రూ. 461 కోట్ల మార్కు దాటిన వైనం! బియ్యం వ్యాపారులపై అధికారుల కొరడా! రైస్ ట్రేడర్స్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు భారత్ - న్యూజిలాండ్ వన్డే సిరీస్: అన్ని మ్యాచ్‌లు ఉదయం 7:30 గంటలకే ప్రారంభం! నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో సంచలన మార్పు: శ్రీలీల స్థానంలో ఆ బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ! కూటమికి ఓటేయండి.. అభివృద్ధిలో భాగస్వాములు కండి: మంత్రి కందుల దుర్గేష్ విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి .. అదనపు కలెక్టర్ సంగీత ఎన్నికల విధుల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ దోసకాయ తినడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషక విలువలు! రామవరంలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి కొండేటి భీమేష్ ఇంటింటా ప్రచారం. మమితా బైజు అసలు పేరు నమిత కాదా.. బర్త్ సర్టిఫికెట్‌లో జరిగిన ఆ పొరపాటే ఆమెను స్టార్‌ను చేసిందా!

మానవతా సేవకు ముందడుగు!

Select Suryaa Now
మానవతా సేవకు ముందడుగు!

గోకవరం, మేజర్ న్యూస్ :  మానవత్వంతో సేవే లక్ష్యంగా గోకవరం కైలాసగిరి నిర్వాహకులు సుంకర వీరబాబు అందిస్తున్న సేవలకు మరో గుర్తింపు లభించింది. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన మానవతా సంస్థలు కైలాసగిరికి రెండు ఫ్రీజర్లను అందజేసి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నాయి. గతంలో గోకవరం ప్రాంతంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల నిమిత్తం రాజమహేంద్రవరం వెళ్లాల్సి వచ్చేది. దీంతో పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేవి. ఈ పరిస్థితిని గుర్తించిన సుంకర వీరబాబు గ్రామ పెద్దలు, దాతల సహకారంతో గోకవరంలో కైలాసగిరిని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ముఖ్యంగా దిక్కులేని అనాథ శవాలకు ఒక్క రూపాయి తీసుకోకుండా అంత్యక్రియల కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. సుంకర వీరబాబు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన మానవతా సంస్థలు కైలాసగిరికి రెండు ఫ్రీజర్లను అందించాయి. ఈ కార్యక్రమానికి తనవంతు సహకారంగా గజింగం సత్తిబాబు రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని అందించి ఫ్రీజర్ కొనుగోలుకు తోడ్పడ్డారు. తాను మానవతా సంస్థలో సభ్యుడిగా సేవలందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సుంకర వీరబాబు మాట్లాడుతూ గోకవరం మండలంలో ఏ గ్రామానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారు మరణించినా వారి కుటుంబాలకు అవసరమైన ఫ్రీజర్ సేవలను ఉచితంగా అందిస్తామని తెలిపారు. అత్యవసర సమయంలో ఎప్పుడు ఫోన్ చేసినా 24 గంటల్లో అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. కైలాసగిరి సేవలకు తనతో పాటు పలువురు సభ్యులు, దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆపదలో ఉన్నవారికి ఆసరాగా నిలిచే ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకం. మానవత్వానికి కులమతాలు లేవని చాటుతున్న గోకవరం కైలాసగిరి సేవలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి.