BREAKING
రణ్‌బీర్ కపూర్, యశ్ ప్రతిష్టాత్మక 'రామాయణం' చిత్రానికి బాంబే హైకోర్టు భారీ రక్షణ! కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవండి - తొప్పాటిపల్లి, తుమ్మిందపాళ్యంలో కంచెర్ల ప్రతిమ ,ప్రచారం - రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటు వేయండి. పనసపండు తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు.. షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవచ్చా? అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ అద్భుత సంచలనం: వన్డే ర్యాంకింగ్స్‌లో శ్రీలంకను వెనక్కి నెట్టి ఆరో స్థానానికి దూసుకెళ్లిన వైనం! రజినీకాంత్ జైలర్ 2 బాక్సాఫీస్ కలెక్షన్లు: సోమవారం భారీ పతనం అయినప్పటికీ రూ. 461 కోట్ల మార్కు దాటిన వైనం! బియ్యం వ్యాపారులపై అధికారుల కొరడా! రైస్ ట్రేడర్స్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు భారత్ - న్యూజిలాండ్ వన్డే సిరీస్: అన్ని మ్యాచ్‌లు ఉదయం 7:30 గంటలకే ప్రారంభం! నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో సంచలన మార్పు: శ్రీలీల స్థానంలో ఆ బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ! కూటమికి ఓటేయండి.. అభివృద్ధిలో భాగస్వాములు కండి: మంత్రి కందుల దుర్గేష్ విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి .. అదనపు కలెక్టర్ సంగీత ఎన్నికల విధుల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ దోసకాయ తినడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషక విలువలు! రామవరంలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి కొండేటి భీమేష్ ఇంటింటా ప్రచారం. మమితా బైజు అసలు పేరు నమిత కాదా.. బర్త్ సర్టిఫికెట్‌లో జరిగిన ఆ పొరపాటే ఆమెను స్టార్‌ను చేసిందా! గెలుపు దిశగా ఎన్డీఏ జడ్పిటిసి టిడిపి అభ్యర్థి దొండపాటి సుబ్బరాజు .

ప్రజావాణిలో పురుగు మందు డబ్బాతో రైతు ఆవేదన

Select Suryaa Now
ప్రజావాణిలో పురుగు మందు డబ్బాతో రైతు ఆవేదన

 

మోత్కూర్, మేజర్ న్యూస్:
మోత్కూర్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణికి ఓ రైతు పురుగుమందు డబ్బాతో రావడం కలకలం రేపింది. మోత్కూర్ మున్సిపల్ పరిధిలోని బుజిలాపురం గ్రామానికి చెందిన రైతు మడూరి నారాయణరెడ్డి ఆయన భార్య నీలమ్మ సోమవారం ఎంపీడీవో కార్యాలయం నిర్వహించిన ప్రజావాణిలో తన భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినపత్రం సమర్పించారు.అనంతరం సంచిలో తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా తీసి తనకు న్యాయం చేయకపోయినట్లయితే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడంతో అధికారుల అప్రమత్తమై ఆ పురుగుల మందు డబ్బాను రైతు నుండి లాక్కొని కార్యాలయం ఆవరణలో నిర్వీర్యం చేశారు. తన భూ సమస్య పరిష్కారం కోసం 8 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తమ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన మూడున్నర ఎకరాల భూమిని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. రెవెన్యూ, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన పరిష్కారం లభించలేదని వాపోయారు. బ్రతుకుతెరువు కోసం హైదరాబాద్ పోయి వచ్చేసరికి తన భూమిని ఆక్రమించుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారని ఆరోపించారు. తనకు తగిన న్యాయం చేయాలని కోరారు.