BREAKING
భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్! టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రజావాణిలో పురుగు మందు డబ్బాతో రైతు ఆవేదన సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు అత్యంత కీలకం 'అధోజల మహాసముద్రాలు' బహుళ వ్యవస్థా క్షీణత వ్యాధి చికిత్స పరీక్షలను నిలిపివేసిన టెవా ఫార్మాస్యూటికల్స్ ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలి - ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోలక్ పల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. కొల్లూరు జాబ్ మేళాకు అనూహ్య స్పందన హంటింగ్టన్ వ్యాధి చికిత్సకు యూనిక్యూర్ జీన్ థెరపీ...మే 1, 2027 నాటికి నిర్ణయం తీసుకోనున్న ఎఫ్‌డీఏ!

పోలింగ్ కేంద్రం లోకి అభ్యర్థిని రానివ్వని సీఐ గంగాధర్

Select Suryaa Now
పోలింగ్ కేంద్రం లోకి అభ్యర్థిని రానివ్వని సీఐ గంగాధర్

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :     ఆత్మకూరులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్బంగా స్థానిక సి ఐ గంగాధర్ తమ అభ్యర్థులను పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారం పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. తమ పార్టీ నాయకులతో, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అల్లారెడ్డి ఇందుమతి, కౌన్సిలర్ అభ్యర్థులు తో పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్బంగా విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ   
ఇప్పటికే సీఐ పై ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసామని,ముందుగానే సీఐ ను ఎన్నికల విధుల నుండి పక్కన పెట్టాలని కోరడం జరిగిందన్నారు.  అయినప్పటికీ అతనితోనే విధులు చేయిస్తూ అధికార పార్టీ ఏజెంట్ గా వ్యవహారిస్తున్నారని మేకపాటి ఆరోపించారు.  అధికార పార్టీ నాయకులు కూడా కేంద్రం లోకి వెళ్తున్నారు. తమ ఏజెంట్ల ను సైతం పోనివ్వడం లేదన్నారు.ఎన్నికల సంఘం వీటన్నిటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని   మేకపాటి విక్రమ్ రెడ్డి కోరారు.