BREAKING
టిపి టి ఎఫ్ నూతన కమిటీ ఎన్నికలు అభివృద్ధిని చూసి ఓటు వేయండి - కాపా శ్రీనివాసరావు జాహ్నవి గెలుపే లక్ష్యంగా పువ్వాడి ఎన్నికల ప్రచార పర్వం కేసీఆర్‌తోనే రైతులకు భరోసా కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు తప్పని తిప్పలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పురుగుల మందు తాగిన ఒక వ్యక్తి విషమించడంతో మృతి. ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి సీనియర్ నేత కొవ్వలి నాయుడు నరసాపురం, సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షుడిగా జనగామ శ్రీనివాస్ గౌడ్ సకల జీవకోటి భగవంతుని కుటుంబమే ఆగిరిపల్లి సెగ్మెంట్‌-1లో కూటమి ఎన్నికల ప్రచారం ఢిల్లీలో జాతీయ స్థాయి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అందోల్ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్.. పెళ్లి కుమారుడికి రూ.10,116 ఆర్థిక సాయం ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు తాండూరులో పలు శుభకార్యాల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మన ఓటు మన హక్కు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ హఫిజున్నీసా అద్దంకిలో 'ఓటరు అవగాహన పోస్టర్' ఆవిష్కరణ

టిపిటిఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

Select Suryaa Now
టిపిటిఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

 కొండపాక :తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టిపిటిఎఫ్ కొండపాక మండల శాఖ సర్వసభ్య సమావేశం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులుగా కే. రామచంద్రం, ప్రధాన కార్యదర్శిగా ఎస్. కనకయ్య , ఉపాధ్యక్షులుగా ఎం. తుకారం, ఎం .శ్రీకాంత్, ఎస్. భాగ్యలక్ష్మి, కార్యదర్శులుగా సిహెచ్ .రమేష్, ఏ. పరమేశ్వర్ రెడ్డి, జి. భారతి, జిల్లా కౌన్సిలర్ గా పి. యాదయ్య, కే. అంజయ్య,  కార్యవర్గ సభ్యులుగా డి. నర్సింలు, బి. చంద్రమౌళి, జి. సత్యలక్ష్మి, బి. రాకేష్ , టి.యాదగిరిలను ఎన్నుకోవడం జరిగింది.  ఎన్నికల నిర్వహణ అధికారిగా కె .రామ్ రెడ్డి, పరిశీలకులుగా కే. తిరుపతిలు వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ విద్యాశాఖ ద్వారా జరిగే కార్యక్రమాలు మండల వనరుల కేంద్రంలోనే జరపాలని, కార్యాలయ సమయపాలన పాటించాలని, ఇటీవల జరిగిన 9వ తరగతి బాహ్య మూల్యాంకనం డబ్బులు వెంటనే చెల్లించాలని,  షూ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అమౌంట్ ప్రధానోపాధ్యాయులకు  చెల్లించాలని, ప్రభుత్వం వెంటనే పి ఆర్ సి ని ప్రకటించి, సిపిఎస్ ని రద్దుచేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలని నూతన కమిటీ తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. నరేందర్, రాష్ట్ర కౌన్సిలర్ కే. రామస్వామి, జిల్లా కార్యదర్శి డి. రాములు నాయకులు బి. ప్రభాకర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.