telangana
ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్.. పెళ్లి కుమారుడికి రూ.10,116 ఆర్థిక సాయం
బంట్వారం, మేజర్ న్యూస్:ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ బంట్వారం మండలం మద్వాపూర్ గ్రామ సర్పంచ్ గోరెమియా తన సేవాభావాన్ని చాటుకున్నారు. గ్రామానికి చెందిన ఓ పెళ్లి కుమారుడికి రూ.10,116 ఆర్థిక సహాయం అందించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వివాహానికి ఆర్థిక సహాయం అందించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ ప్రజాప్రతినిధి అంటే కేవలం పదవిలో ఉండటమే కాకుండా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వారి సుఖదుఃఖాల్లో భాగస్వాములు కావడమే నిజమైన ప్రజాసేవ అని పేర్కొన్నారు. సర్పంచ్ గోరెమియా తన హామీని అమలు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.