పురుగుల మందు తాగిన ఒక వ్యక్తి విషమించడంతో మృతి.
1. సూర్య, ముధోల్ మండలం :
జీవనోపాధి కోసం వలస వచ్చిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం అంజి గ్రామానికి చెందిన వాగ్మారే సంజీవ్ (45) కుటుంబంతో కలిసి ముథోల్ మండలం పిప్రి గ్రామానికి వలస వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అక్టోబర్ 31న మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయాడు. గ్రామ శివారులోని పంట పొలాల్లో పురుగుల మందు సేవించాడని విషయం తెలుసుకున్న కుటుంబీకులు 108 అంబులెన్స్ లో భైంసా, నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి కుమారుడు వాగ్మారే మనోజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.