టిపి టి ఎఫ్ నూతన కమిటీ ఎన్నికలు
కొండపాక;తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టిపిటిఎఫ్ కొండపాక మండల శాఖ సర్వసభ్య సమావేశం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులుగా కే. రామచంద్రం, ప్రధాన కార్యదర్శిగా ఎస్. కనకయ్య , ఉపాధ్యక్షులుగా ఎం. తుకారం, ఎం .శ్రీకాంత్, ఎస్. భాగ్యలక్ష్మి, కార్యదర్శులుగా సిహెచ్ .రమేష్, ఏ. పరమేశ్వర్ రెడ్డి, జి. భారతి, జిల్లా కౌన్సిలర్ గా పి. యాదయ్య, కే. అంజయ్య, కార్యవర్గ సభ్యులుగా డి. నర్సింలు, బి. చంద్రమౌళి, జి. సత్యలక్ష్మి, బి. రాకేష్ , టి.యాదగిరిలను ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల నిర్వహణ అధికారిగా కె .రామ్ రెడ్డి, పరిశీలకులుగా కే. తిరుపతిలు వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ విద్యాశాఖ ద్వారా జరిగే కార్యక్రమాలు మండల వనరుల కేంద్రంలోనే జరపాలని, కార్యాలయ సమయపాలన పాటించాలని, ఇటీవల జరిగిన 9వ తరగతి బాహ్య మూల్యాంకనం డబ్బులు వెంటనే చెల్లించాలని, షూ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అమౌంట్ ప్రధానోపాధ్యాయులకు చెల్లించాలని, ప్రభుత్వం వెంటనే పి ఆర్ సి ని ప్రకటించి, సిపిఎస్ ని రద్దుచేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలని నూతన కమిటీ తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. నరేందర్, రాష్ట్ర కౌన్సిలర్ కే. రామస్వామి, జిల్లా కార్యదర్శి డి. రాములు నాయకులు బి. ప్రభాకర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.