BREAKING
భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్! టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రజావాణిలో పురుగు మందు డబ్బాతో రైతు ఆవేదన సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు అత్యంత కీలకం 'అధోజల మహాసముద్రాలు' బహుళ వ్యవస్థా క్షీణత వ్యాధి చికిత్స పరీక్షలను నిలిపివేసిన టెవా ఫార్మాస్యూటికల్స్ ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలి - ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోలక్ పల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. కొల్లూరు జాబ్ మేళాకు అనూహ్య స్పందన హంటింగ్టన్ వ్యాధి చికిత్సకు యూనిక్యూర్ జీన్ థెరపీ...మే 1, 2027 నాటికి నిర్ణయం తీసుకోనున్న ఎఫ్‌డీఏ!

బీసీ కాలనీలో స్థల వివాదం.. జేసీబీతో హడావుడిగా చదును!

Select Suryaa Now
బీసీ కాలనీలో స్థల వివాదం.. జేసీబీతో హడావుడిగా చదును!

సైదాపురం మండలం, మేజర్ న్యూస్ :  సైదాపురం మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఆదివారం స్థల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పంచాయతీకి చెందిన స్థలంగా అధికారులు పేర్కొంటున్న ప్రాంతంపై రెండు వర్గాల మధ్య హక్కులు, వినియోగానికి సంబంధించి వివాదం చెలరేగింది. సుమారు 50 ఏళ్లుగా తాము ఆ స్థలాన్ని వినియోగించుకుంటున్నామని ఓ వర్గం చెబుతుండగా, మరోవైపు ఆ స్థలం పంచాయతీకి చెందిందనే వాదన వినిపిస్తోంది.  ఈ క్రమంలో ఆలయ నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు జేసీబీని తీసుకొచ్చి స్థలంలోని చెట్లను తొలగించి చదును చేయించే ప్రయత్నం చేయడం వివాదానికి ఆజ్యం పోసింది. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మరో వర్గం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.  సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇరువర్గాలు తమ వాదనలకు కట్టుబడి ఉండటంతో పరిస్థితి వెంటనే సద్దుమణగలేదు. దీంతో బీసీ కాలనీలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈ హడావుడి ఎందుకు?

ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో స్థలానికి సంబంధించిన హక్కులు, పంచాయతీ అనుమతులు, వివాద పరిష్కారం వంటి అంశాలపై స్పష్టత లేకుండానే జేసీబీతో చదును చేసే ప్రయత్నం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిజంగా ఆలయ నిర్మాణమే లక్ష్యమైతే సంబంధిత అధికారుల అనుమతులు తీసుకుని, వివాదానికి తావులేకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదా? అన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.  ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించాల్సిన పవిత్రమైన ఆలయ నిర్మాణం పేరుతో రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించే పరిస్థితి రావడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ స్థలమైతే దానికి సంబంధించిన రికార్డులు బహిర్గతం చేయాలి. దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న స్థలమైతే ఆ వాదనను కూడా అధికారులు పరిశీలించాలి. అంతేగానీ ఎవరి ఇష్టానుసారం వారు జేసీబీలు తీసుకొచ్చి స్థలాలను చదును చేయడం సరైన విధానం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారులు మౌనం వీడాలి.. వాస్తవాలు వెల్లడించాలి!

ఈ స్థలానికి సంబంధించిన పంచాయతీ రికార్డులు, గత వినియోగ వివరాలు, ఆలయ నిర్మాణానికి సంబంధించిన అనుమతులపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఎన్నికల అధికారులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.  ప్రజల మధ్య వివాదాలు పెరిగేలోపు అధికారులు జోక్యం చేసుకుని స్థల హక్కులపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, రాజకీయ పలుకుబడికి తలొగ్గకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.