BREAKING
మాగుంట లేఔట్‌లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల నిశ్చితార్థ వేడుకకు హాజరైన శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం --పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ మలబార్ ఉద్యోగుల స్వచ్ఛ భారత్ పోలింగ్ సరళిని పరిశీలించిన తారక్ నాథ్ రెడ్డి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల చీరాల, రేపల్లెలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు చీరాలలో 72.69 శాతం.. రేపల్లెలో 69.65 శాతం పోలింగ్ మురసు తుఫాన్‌పై జిల్లా యంత్రాంగం హైఅలర్ట్ రిటైర్మెంట్ రోజే ఉద్యోగికి అన్ని బెనిఫిట్స్ అందించాలి "అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం - కాకాణి" నాగర్‌కర్నూల్‌లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వినూత్న నిరసన రాష్ట్రానికి పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు తుఫాను ప్రభావంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష తెలుగుదేశం పార్టీలో చేరిన వైసిపి నాయకులు పేదల వైద్యానికి నీలిమ హాస్పిటల్‌ భరోసా కల్పిస్తోంది : మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి షెడ్యూల్ కంటే ముందే వచ్చి, ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయినట్లు జగన్ హడావుడి ---- స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్

ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

Select Suryaa Now
ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

నెల్లూరు,  మేజర్ న్యూస్ :    నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.  ఆదివారం ఉదయం నెల్లూరు నగరంలోని మూలాపేట, రామయ్య బడి, మాగుంట లేఅవుట్ ప్రాంతాల్లో పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ మోటార్ బైక్‌పై వెళ్లి స్వయంగా పరిశీలించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా పర్యటిస్తూ పోలింగ్ సరళిని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షం పడుతున్నప్పటికీ ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారని తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని, అర్హులైన ఓటర్లందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు ఎపిక్ కార్డు తప్పనిసరి కాదని, ఎన్నికల సంఘం అనుమతించిన ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులతో కూడా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు.  వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నవంబరు 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించే డీకేడబ్ల్యూ కళాశాల ప్రాంగణంలో పూర్తిస్థాయిలో వర్షపు నీటి నుంచి రక్షణ కల్పించే ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. వర్షం వచ్చినప్పటికీ కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.  కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ నందన్, అధికారులు ఉన్నారు.