మోటర్ బైక్‌పై పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు నగరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా మోటర్ బైక్‌పై పర్యటిస్తూ వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా మూలాపేటలోని డీఎస్ఆర్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ తీరు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.