BREAKING
ఏదో ఒక రోజు ‌మల్కాపూర్ స్వచ్ఛభారత్ ప్రధాని దృష్టికి వెళుతుంది ముఖ్యఅతిథిగా తూప్రాన్ డిఎల్పిఓ సాయిబాబా ఉప సర్పంచ్ స్వామి కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల్లో సర్వతోముఖాభివృద్ది జలదంకి లో జన ప్రభంజనం పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఏఎస్ పేటలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి హబీబ్ భాషా బెంగళూరు ఫైవ్‌స్టార్ హోటల్ పూల్‌లో అనుమానాస్పద రీతిలో జర్మన్, స్లోవాక్ జాతీయుల మృతి! పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండా పిరికిపందలా పారిపోయారు : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పరవాడ పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి వివాహ వేడుకలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు మాగుంట లేఔట్‌లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల నిశ్చితార్థ వేడుకకు హాజరైన శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం --పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ మలబార్ ఉద్యోగుల స్వచ్ఛ భారత్ పోలింగ్ సరళిని పరిశీలించిన తారక్ నాథ్ రెడ్డి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల చీరాల, రేపల్లెలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు చీరాలలో 72.69 శాతం.. రేపల్లెలో 69.65 శాతం పోలింగ్

మురసు తుఫాన్‌పై జిల్లా యంత్రాంగం హైఅలర్ట్➖ కలెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్ రూం ఏర్పాటు

Select Suryaa Now
మురసు తుఫాన్‌పై జిల్లా యంత్రాంగం హైఅలర్ట్➖ కలెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్ రూం ఏర్పాటు

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   మురసు తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సూచించారు. నవంబర్ 2వ తేదీ సాయంత్రం నుంచి అర్ధరాత్రి మధ్య కావలి – కందుకూరు మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో జిల్లాలో నవంబర్ 3వ తేదీ మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తుఫాన్ ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.

కావలి పట్టణం, పరిసర ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, నెల్లూరు నగరం నుంచి గూడూరు వరకు తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు, తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన సురక్షిత ప్రాంతాలకు ముందుగానే తరలివెళ్లాలని స్పష్టం చేశారు.

భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని సూచించారు. పూరిగుడిసెలు, పాత మిద్దెలు, మట్టి గోడల ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని తెలిపారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. పశువులు, మేకలు, గొర్రెలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పశుసంవర్ధక శాఖ అధికారులు, యజమానులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా సంబంధిత శాఖలు సంసిద్ధంగా ఉండాలని తెలిపారు.

కలెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్ రూం ఏర్పాటు

తుఫాన్, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు, వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూం నంబర్లకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కంట్రోల్ రూం నంబర్లు: 0861-2331261 7995576699

ఎటువంటి పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉందని, ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల విజ్ఞప్తి చేశారు.