ఏఎస్ పేటలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి హబీబ్ భాషా
అనుమసముద్రంపేట, మేజర్ న్యూస్ : ఏఎస్ పేట లోని బిట్ 2 సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉన్న సయ్యద్ హబీబ్ భాష ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు ఏఎస్పేట బిట్టు 2 సెగ్మెంట్ పరిధిలోని చందలూరుపాడు, గండువారిపల్లి, ఏ ఎస్ పేట గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కరపత్రాలను అందజేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు ఎంపీటీసీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని హబీబ్ భాషా తెలిపారు