BREAKING
శాంతిభద్ర సమస్యకు జగనే కారణం. ఘనంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఆదివాసీ సమాజ సేవే వనవాసి కళ్యాణ పరిషత్ లక్ష్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన నిర్మల్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు పండిత్ జాదవ్ కు ఘన సన్మానం ఢిల్లీ కాంగ్రెస్ సభలో పాల్గొన్న జైపూర్ మండల నాయకులు చుక్క ముగిసింది..!లెక్క మిగిలింది..!! జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం రామలింగాపురంలో టీడీపీలో చేరిన 40 కుటుంబాలు జగిత్యాలలో ఈపీఎఫ్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి రాప్తాడు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి పక్కా ప్రణాళిక, పటిష్ట భద్రతా చర్యలతో.. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు.... ఈ నెల 5న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాక 2021తో పోలిస్తే కళ్యాణదుర్గం లో తగ్గిన ఓటింగ్ శాతం. వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ రిలీజ్ డేట్.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలివే

దీపావళి పండుగ విశిష్టతపై ఇంటింటా భగవద్గీత ప్రచారం

Select Suryaa Now
దీపావళి పండుగ విశిష్టతపై ఇంటింటా భగవద్గీత ప్రచారం

జిన్నారం;దీపావళి పండుగను పురస్కరించుకుని త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జిన్నారం మండలంలోని పుట్టగూడ, కొడకంచి గ్రామాల్లో ఇంటింటా త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి భగవద్గీతలోని త్రైత సిద్ధాంత భావాలను, దీపావళి పండుగ విశిష్టతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఇందూ జ్ఞాన వేదిక సభ్యులు మాట్లాడుతూ గురువు తన జ్ఞానాగ్నితో శిష్యులలో జ్ఞానజ్యోతిని వెలిగించి యోగమార్గంలో నడిపిస్తాడనే భావనకు గుర్తుగా దీపావళి రోజున ఇంటి లోపల దీపాలు వెలిగించాలని తెలిపారు. అలాగే విశ్వాన్ని నడిపించే పరమాత్మ శక్తికి గుర్తుగా ఇంటి బయట కూడా దీపాలు వెలిగించాలని వివరించారు. మనం నివసించే ఇంటిని మానవ శరీరంతో పోల్చుకుంటే ఇంటి లోపల దీపాలు వెలిగించడం జ్ఞానాగ్నికి, ఇంటి బయట దీపాలు వెలిగించడం పరమాత్మ శక్తికి ప్రతీకలని పేర్కొన్నారు. దీపావళి పండుగలో దీపాలు వెలిగించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుని ఆచరించినప్పుడే అది జ్ఞాన సంప్రదాయంగా మారుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. గిరి, సభ్యులు ఎన్.ఎస్. కుమార్, మధు, అంజి, సుధీర్, శ్రీనివాస్, ప్రథమ, సామ్రాట్, పవన్, లక్ష్మీ, నాగమణి, చంద్రకళ, పద్మ, ప్రేమలత, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.